 
															PC: X
భారత హాకీ దిగ్గజం మాన్యుయేల్ ఫ్రెడెరిక్ (Manuel Frederick- 78)కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.
మొట్టమొదటి క్రీడాకారుడు
కాగా కేరళలోని కన్నూరు జిల్లాకు చెందిన చెందిన ఫ్రెడెరిక్ రాష్ట్రం తరఫున ఒలింపిక్ పతకం గెలిచిన మొట్టమొదటి క్రీడాకారుడు. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో భారత్ హాలాండ్‌ను ఓడించి కాంస్య పతకం గెలవడంలో ఆయన గోల్‌కీపర్‌గా తన వంతు పాత్ర పోషించారు.
ధ్యాన్ చంద్ అవార్డు
అదే విధంగా.. నేషనల్ చాంపియన్స్ టైబ్రేకర్స్‌లో జట్టును 16 సార్లు విజేతగా నిలపడంలో కీలకంగా వ్యవహరించారు. భారత జట్టు తరఫున ఏడేళ్లపాటు హాకీ ఆడిన ఫ్రెడెరిక్ 2019లో ధ్యాన్ చంద్ అవార్డు అందుకున్నారు.
కాగా ఫుట్‌బాల్ స్ట్రైకర్‌గా కెరీర్ ఆరంభించిన ఫ్రెడెరిక్.. ఆ తర్వాత హాకీ గోల్‌కీపర్‌గా నిలదొక్కుకున్నారు. అక్టోబరు 20, 1947లో జన్మించిన ఫ్రెడెరిక్ పదిహేడేళ్ల వయసులో బాంబే గోల్డ్ కప్ ఆడారు. 1971లో తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ఫ్రెడెరిక్.. క్యాన్సర్ బారిన పడి లోకాన్ని వీడారు. బెంగళూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఇదీ చదవండి: ప్రాక్టీస్‌లో బంతి తగిలి... యువ క్రికెటర్ మృతి 
మెల్‌బోర్న్: ప్రాక్టీస్ సమయంలో బంతి బలంగా తగలడంతో... ఆస్ట్రేలియాకు చెందిన యువ క్రికెటర్ బెన్ ఆస్టిన్ మృతి చెందాడు. మెల్‌బోర్న్‌లో నెట్ ప్రాక్టీస్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మెల్‌బోర్న్‌లో ఫెరన్‌ట్రీ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న 17 ఏళ్ల బెన్ ఆస్టిన్ జట్టు సభ్యులతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి అతడి మెడకు బలంగా తగిలింది. 
దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా... వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ‘బెన్ ఆస్టిన్ మృతితో పూర్తిగా కుంగిపోయాము. దీని ప్రభావం మొత్తం క్రికెట్‌పై పడుతుంది. ఈ క్లిష్ట సమయంలో అతడి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి’ అని క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రాక్టీస్ సమయంలో బెన్ హెల్మెట్ ధరించినా... నెక్ గార్డ్ లేకపోవడంతోనే బంతి అతడి మెడ నరాలను దెబ్బతీసింది. 2014లోనూ ఆ్రస్టేలియాలో ఇలాంటి సంఘటనే జరిగింది. న్యూ సౌత్ వేల్స్‌తో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ సందర్భంగా... సౌత్ ఆ్రస్టేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఫిలిప్ హ్యూగ్స్ 25 ఏళ్ల వయసులో బంతి చెవి దగ్గర బలంగా తగలడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. ఇప్పుడు తాజా ఘటనతో మరోసారి క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా గురువారం భారత్, ఆసీస్ మధ్య సెమీఫైనల్ సందర్భంగా ప్లేయర్లు నల్ల రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు.
చదవండి: చిన్న పిల్లలా ఏడ్చేసిన హర్మన్‌ప్రీత్.. అంబరాన్నంటిన సంబరాలు.. వీడియో

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
