breaking news
Pro Kabaddi 2025
-
జైపూర్ పింక్ పాంథర్స్ 'సిక్సర్'
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ ఆరో విజయం నమోదు చేసుకుంది. హరియాణా స్టీలర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 37–36 పాయింట్ల తేడాతో గెలిచింది. జైపూర్ తరఫున సాహిల్ 7, అలీ 6 పాయింట్లు సాధించారు.స్టీలర్స్ తరఫున వినయ్ 11 పాయింట్లతో పోరాడినా సరిపోలేదు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో స్టీలర్స్ 21 రెయిడ్ పాయింట్లు సాధించగా... జైపూర్ 16 రెయిడ్ పాయింట్లకే పరిమితమైంది. అయితే ఆలౌట్ పాయింట్లు, ఎక్స్ట్రా పాయింట్లలో ముందంజ వేసిన పింక్ పాంథర్స్ విజయం సాధించింది. తాజా సీజన్లో 10 మ్యాచ్‌లాడిన జైపూర్ పింక్ పాంథర్స్ 6 విజయాలు, 4 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టికలో ఐదో స్థానానికి చేరింది. హర్యానా స్టీలర్స్ 10 మ్యాచ్‌లో 6 గెలిచి నాలుగింట ఓడి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. మరో మ్యాచ్‌లో యు ముంబా 42–24 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై గెలుపొందింది. యు ముంబా తరఫున సందీప్ కుమార్ 12 పాయింట్లతో విజృంభించగా... తలైవాస్ తరఫున అత్యధికంగా రోహిత్ గోపాల్ 7 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పుణేరి పల్టన్‌తో బెంగళూరు బుల్స్... గుజరాత్ జెయింట్స్‌తో యు ముంబా తలపడతాయి.చదవండి: AB de Villiers: ఆసియాకప్ ట్రోఫీ వివాదం.. టీమిండియాపై డివిలియర్స్ విమర్శలు -
ఉత్కంఠపోరులో తెలుగు టైటాన్స్ ఓటమి..
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో తెలుగు టైటాన్స్‌కు బెంగళూరు బుల్స్ చేతిలో పరాజయం ఎదురైంది. సోమవారం జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో బెంగళూరు 34–32 పాయింట్ల తేడాతో టైటాన్స్‌పై గెలుపొందింది. మ్యాచ్ ముగిసే దశలో అనూహ్యంగా ఆధిక్యాన్ని కోల్పోయిన తెలుగు టైటాన్స్ చివరకు 2 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్ జట్టులో ఆల్‌రౌండర్లు భరత్, కెపె్టన్ విజయ్ మలిక్ అదరగొట్టారు. 19 సార్లు కూతకెళ్లిన భరత్ 13 పాయింట్లు తెచ్చిపెట్టాడు. 18 సార్లు రెయిడింగ్ చేసిన విజయ్ 9 పాయింట్లు సాధించాడు. బెంగళూరు తరఫున అలీరెజా మిర్జాయిన్ (11) రాణించాడు. కీలక తరుణంలో పాయింట్లు చేసి జట్టును గెలిపించాడు. మిగతా వారిలో డిఫెండర్లు యోగేశ్ 3, దీపక్ శంకర్ 2, రెయిడర్ ఆకాశ్ షిండే 2 పాయింట్లు సాధించారు. ఈ సీజన్లో 6 మ్యాచ్‌లాడిన తెలుగు జట్టుకిది మూడో పరాజయం.అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 40–37తో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. స్టీలర్స్ తరఫున రెయిడర్లు శివమ్ పతారే (12), వినయ్ (8), డిఫెండర్లు జైదీప్ (6), సాహిల్ నర్వాల్ (4), రాహుల్ (3) రాణించారు.గుజరాత్ జట్టులో రెయిడర్ రాకేశ్ (14) చక్కని పోరాటం చేశాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను 14 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. మిగతావారిలో నితిన్ పన్వార్ 3, లక్కీ శర్మ, శుభమ్ కుమార్ చెరో 2 పాయింట్లు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో యూపీ యోధాస్, తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి.చదవండి: Asia Cup 2025: శ్రమించి గెలిచిన శ్రీలంక -
తెలుగు టైటాన్స్‌కు రెండో విజయం
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ లో తెలుగు టైటాన్స్ రెండో విజయాన్ని సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో టైటాన్స్ 44–34 తో బెంగాల్ వారియర్స్‌పై నెగ్గింది. టైటాన్స్ జట్టులో భరత్ 12, విజయ్ 11 పాయింట్లు సాధించారు. రెయిడర్ చేతన్ సాహు, డిఫెండర్ అంకిత్ చెరో 5 పాయింట్లు చేశారు. బెంగాల్ తరఫున కెప్టెన్ దేవాంక్ ఒంటరి పోరాటం చేసి 13 పాయింట్లు సాధించాడు. డిఫెండర్లలో నితీశ్ (6), ఆశిష్ (5) మెరుగ్గా ఆడారు. అనంతరం పోటాపోటీగా జరిగిన రెండో మ్యాచ్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన జైపూర్ పింక్ పాంథర్స్ 35–36తో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. దబంగ్ కెప్టెన్ అశు మలిక్ 21 పాయింట్లు సాధించాడు. జైపూర్ తరఫున రెయిడర్లు నితిన్ (14), సాహిత్ (10) రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో హరియాణాతో బెంగళూరు బుల్స్, పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
పైరేట్స్‌కు యోధాస్ షాక్
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో యూపీ యోధాస్ జోరు పెంచుతోంది. ఈ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూపీ 34–31తో మూడుసార్లు చాంపియన్ అయిన పట్నా పైరేట్స్‌ను కంగుతినిపించింది. ఆట ఆరంభంలో పైరేట్స్ పైచేయి కనబరిచింది. మొదటి పది నిమిషాలైతే చకచకా పాయింట్లు రాబట్టిన పట్నా 7–6తో ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత యూపీ యోధాస్ ఆటగాళ్లు సమష్టిగా రాణించడంతో పట్నా వెనుకబడింది. రెయిడర్లలో గగన్ గౌడ 7 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో భవాని రాజ్‌పుత్, శివమ్ చెరో 5 పాయింట్లు చేశారు. డిఫెండర్లలో కెప్టెన్ సుమిత్, అశు సింగ్ తలా 5 పాయింట్లు సాధించారు. పట్నా పైరేట్స్ జట్టులో రెయిడర్లు అయాన్ (9) మణిందర్ సింగ్ (7) రాణించారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో మాజీ చాంపియన్ పుణేరి పల్టన్ 41–19తో గుజరాత్ జెయంట్స్‌పై అలవోక విజయం సాధించింది. రెయిడింగ్ లో ఆదిత్య షిండే (6), పంకజ్ (5), డిఫెండర్లలో అభినేశ్ (6), గౌరవ్ ఖత్రి (4) అద్భుతంగా ఆడారు. ఆల్‌రౌండర్లు అస్లామ్ (5), గుర్దీప్ (4)లు కూడా మెరుగ్గా రాణించడంతో పుణేరి జట్టు క్రమం తప్పకుండా పాయింట్లు సాధించింది. గుజరాత్ తరఫున రెయిడర్ రాకేశ్ (6) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరిచాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో దబంగ్ ఢిల్లీతో బెంగళూరు బుల్స్, జైపూర్ పింక్ పాంథర్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
తమిళ్ తలైవాస్‌కు షాక్
విశాఖ స్పోర్ట్స్: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా ఆఖర్లో పుంజుకొని తమిళ్ తలైవాస్‌కు షాక్ ఇచ్చింది. మాజీ చాంపియన్ యు ముంబా 36–33 పాయింట్ల తేడాతో తలైవాస్‌ను ఓడించి ఈ లీగ్‌లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. యు ముంబా రెయిడర్ అజిత్ చౌహాన్ 9, ఆల్‌రౌండర్ అనిల్ 8 పాయింట్లు సాధించారు. డిఫెండర్లలో లోకేశ్, రింకూ చెరో 4 పాయింట్లు స్కోరు చేశారు. తమిళ్ రెయిడర్ అర్జున్ దేశ్వాల్ 18 సార్లు కూతకెళ్లి 12 పాయింట్లు తెచ్చిపెట్టాడు. మిగతా వారిలో కెపె్టన్ పవన్ సెహ్రావత్ 7, డిఫెండర్లు నితీశ్ కుమార్, హిమాన్షు చెరో 4 పాయింట్లు చేశారు. అనంతరం జరిగిన రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ హరియాణా స్టీలర్స్‌కు బెంగాల్ వారియర్స్ చేతిలో చుక్కెదురైంది. కెపె్టన్ దేవాంక్ (21) రెయిడింగ్‌లో చెలరేగడంతో 2019 చాంపియన్ బెంగాల్ 54–44తో హరియాణా స్టీలర్స్‌పై విజయం సాధించింది. వారియర్స్ జట్టులో దేవాంక్తో పాటు మరో రెయిడర్ మన్‌ప్రీత్ (13) అదరగొట్టాడు. స్టీలర్స్ జట్టులో రెయిడర్లు శివమ్ పటారే (17), వినయ్ (13) రాణించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో యూపీ యోధాస్, పుణేరి పల్టన్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడతాయి. -
తీరు మారని తెలుగు టైటాన్స్.. వరుసగా రెండో ఓటమి
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. సీజన్ ఆరంభ పోరులో తమిళ్ తలైవాస్ చేతిలో ఓడిన టైటాన్స్... తాజాగా యూపీ యోధాస్ చేతిలో కూడా పరాజయం పాలైంది. శనివారం తెలుగు టైటాన్స్ 35–40 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్ చేతిలో ఓడింది. గత సీజన్లో పేలవ ప్రదర్శనతో పట్టికలో ఏడోస్థానానికి పరిమితమైన టైటాన్స్... ఈ సీజన్ ఆరంభంలో విశాఖ తీరంలో జరుగుతున్న మ్యాచ్‌ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోతోంది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్ 14 పాయింట్లతో ఒంటరి పోరాటం చేయగా... అతడికి సహచరుల నుంచి సరైన సహకారం అందలేదు. చేతన్ సాహు 4, భరత్ 3 పాయింట్లు సాధించారు. విజయ్ ఈ సీజన్లో తొలి సూపర్–10 ఖాతాలో వేసుకున్నాడు. యూపీ యోధాస్ తరఫున గగన్ గౌడ 14 పాయింట్లతో విజృంభించగా... కెప్టెన్ సుమిత్ సాంగ్వాన్ (8 పాయింట్లు), గుమాన్ సింగ్ (7 పాయింట్లు) అతడికి అండగా నిలిచారు. యూ ముంబా, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ నిరీ్ణత సమయంలో 29–29 పాయింట్లతో ‘టై’కాగా... ఆ తర్వాత నిర్వహించిన సూపర్ రెయిడ్స్‌లో యూ ముంబా 6–5 పాయింట్ల తేడాతో గెలుపొందింది. నిర్ణీత సమయంలో యూ ముంబా జట్టు తరఫున రోహిత్ రాఘవ్ 7, అజిత్ చౌహాన్ 6 పాయింట్లు సాధించారు. గుజరాత్ టైటాన్స్ తరఫున హిమాన్షు సింగ్ 7 పాయింట్లు, రాకేశ్ 5 పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో తమిళ్ తలైవాస్‌తో యూ ముంబా (రాత్రి 8 గంటలకు), బెంగాల్ వారియర్స్‌తో హర్యానా స్టీలర్స్ (రాత్రి 9 గంటలకు) తలపడతాయి.చదవండి: KCL 2025: టీ20ల్లో ప్రపంచ రికార్డు.. రెండు ఓవర్లలో 71 పరుగులు! వీడియో -
ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌ను ప్రారంభించిన వైభవ్ సూర్యవంశీ (ఫొటోలు )
-
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
ఐపీఎల్ తర్వాత ప్రేక్షకాదరణలో రెండో స్థానంలో నిలిచిన ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 12వ సీజన్‌కు ముందు ఆటగాళ్ల వేలం ప్రక్రియకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. దబంగ్ ఢిల్లీ స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ (Naveen Kumar) తొలిసారి పీకేఎల్ వేలానికి వచ్చాడు. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలుకాగా దబంగ్ ఢిల్లీ (Dabang Delhi) 8వ సీజన్లో విజేతగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ తరఫున ఆరు సీజన్లు ఆడిన నవీన్ 1102 రెయిడింగ్ పాయింట్లు సాధించాడు. అలాంటి ఆటగాడిని ఢిల్లీ వదిలేసుకోవడంతో మిగతా ఫ్రాంచైజీలు అతనిపై కన్నేశాయి.ఇలా విడుదల, అట్టిపెట్టుకున్న ఆటగాళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను 12 ఫ్రాంచైజీలు ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీలు కలిపి 83 మందిని రిటెయిన్ (అట్టిపెట్టుకోవడం) చేసుకున్నాయి. నాలుగు కేటగిరీలుమొత్తం నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లను అట్టిపెట్టుకునే వీలుంది. ఎ, బి, సి, డిగా విభజించిన రిటెయినర్లలో ఎ ఆటగాడికి రూ. 30 లక్షలు, బి ప్లేయర్‌కు రూ. 20 లక్షలు, సి, డి ఆటగాళ్లకు వరుసగా రూ. 13 లక్షలు, రూ. 9 లక్షలు చెల్లించాల్సివుంటుంది.ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ట పరిమితి రూ. 5 కోట్లకు లోబడే రిటెయిన్ మొత్తాన్ని తీసివేయగా మిగిలిన మొత్తంతో ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముంబైలో ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో రెండు రోజుల పాటు కబడ్డీ ఆటగాళ్ల వేలం పాట జరుగనుంది.ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ప్లేయర్లుబెంగాల్ వారియర్స్: విశ్వాస్, యశ్ మలిక్, మన్జీత్, దీప్ కుమార్, సుశీల్ కాంబ్రేకర్. బెంగళూరు బుల్స్: చంద్ర నాయక్, లక్కీ కుమార్, మన్జీత్, పంకజ్. దబంగ్ ఢిల్లీ: సందీప్, మోహిత్. గుజరాత్ జెయింట్స్: హిమాన్షు సింగ్, హిమాన్షు, ప్రతీక్ దహియా, రాకేశ్. హరియాణా స్టీలర్స్: రాహుల్ సెప్తాల్, వినయ్, శివమ్ అనీల్, జైదీప్, జయసూర్య, విశాల్ తటే, సాహిల్ మనికందన్, వికాస్ రామదాస్ జాదవ్. జైపూర్ పింక్‌పాంథర్స్: రెజా మిర్బాఘెరి, అభిషేక్, రోనక్ సింగ్, నితిన్ కుమార్, సోంబిర్, రితిక్ శర్మ. పట్నా పైరేట్స్: హమిద్ మిర్జాయి నదిర్, త్యాగరాజన్ యువరాజ్, సుధాకర్, అయాన్, నవ్‌దీప్, దీపక్, సాహిల్ పాటిల్. పుణేరి పల్టన్: అభినేశ్, గౌరవ్ ఖత్రి, పంకజ్ మోహితే, అస్లామ్ ముస్తఫా, మోహిత్ గోయత్, దాదాసొ శివాజీ పూజారి, ఆదిత్య తుషార్ షిండే. తమిళ్ తలైవాస్: మొయిన్ షఫాగి, హిమాన్షు, సాగర్, నితేశ్ కుమార్, నరేందర్, రోనక్, విశాల్ చహల్, ఆశిష్, అనూజ్ గవాడే, ధీరజ్ రవీంద్ర బైల్మరే. తెలుగు టైటాన్స్: శంకర్ భీమ్రాజ్, అజిత్ పాండురంగ పవార్, అంకిత్, ప్రఫుల్ జవారే, సాగర్ చేతన్ సాహు, నితిన్, రోహిత్. యు ముంబా: సునీల్ కుమార్, రోహిత్, అమిర్ మొహమ్మద్, సతీశ్ కన్నన్, ముకిలన్ షణ్ముగమ్, అజిత్ చౌహాన్, దీపక్ కుండు, లోకేశ్ గోస్లియా, సన్నీ.యూపీ యోధాస్: సుమిత్, భవానీ రాజ్‌పుత్, సాహుల్ కుమార్, సురేందర్ గిల్, అషు సింగ్, హితేశ్ గగన గౌడ, శివమ్ చౌదరి, జయేశ్ వికాస్ మహాజన్, గంగారామ్, సచిన్, కేశవ్ కుమార్.చదవండి: Football Tournament: ఉత్కంఠ పోరులో భారత్ విజయం..