
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ విజయపరంపర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 40–35 పాయింట్ల తేడాతో యూపీ యోధాస్‌ను ఓడించింది. ఈ సీజన్‌లో టైటాన్స్ జట్టుకిది ఓవరాల్‌గా ఏడో విజయం కాగా... వరుసగా నాలుగో గెలుపు.
టైటాన్స్ తరఫున భరత్ హుడా 14 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కెపె్టన్ విజయ్ మలిక్ తొమ్మిది పాయింట్లతో మెరిశాడు. డిఫెండర్ శుబ్‌మన్ షిండే ఐదు పాయింట్లతో ఆకట్టుకున్నాడు. యూపీ యోధాస్ తరఫున భవానీ రాజ్‌పుత్ 16 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది.
ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన తెలుగు టైటాన్స్ ఏడింటిలో గెలిచి, ఐదింటిలో ఓడి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 33–29తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో జైపూర్ పింక్‌పాంథర్స్‌తో దబంగ్ ఢిల్లీ; యూపీ యోధాస్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి.
చదవండి: ICC Womens World Cup 2025: పాక్‌పై భారత్ గెలుపు.. మహిళలూ మురిపించారు