ప్రో కబడ్డీ లీగ్-2025లో తెలుగు టైటాన్స్ తమ జోరును కొనసాగిస్తోంది. మంగళవారం ఢిల్లీ వేదికగా పాట్నా పైరేట్స్‌తో జరిగిన ఎలిమినేటర్-3 మ్యాచ్‌లో 46-39 తేడాతో టైటాన్స్ విజయం సాధించింది. దీంతో క్వాలిఫయర్-2కు తెలుగు టైటాన్స్ అర్హత సాధించింది.
టైటాన్స్ ఆల్‌రౌండర్ భరత్ హుడా మరోసారి తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ కీలక మ్యాచ్‌లో భరత్ ఏకంగా 23 పాయింట్లు సాధించాడు. అందులో 17 టచ్ పాయింట్లు, 6 బోనస్ పాయింట్లు ఉన్నాయి.
కెప్టెన్ విజయ్ మాలిక్ మాత్రం కేవలం 5 పాయింట్లు తీసుకొచ్చాడు. పాట్నా రైడర్స్‌లో అయాన్ మినహా మిగితా అందవరూ విఫలమయ్యారు. బుధవారం జరగనున్న క్వాలిఫయర్-2లో పుణేరి పల్టన్‌తో టైటాన్స్ తలపడనుంది.
చదవండి: PKL 2025: పాట్నాను చిత్తు చేసిన తెలుగు టైటాన్స్.. క్వాలిఫయర్-2కు అర్హత


