
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్–12)లో తెలుగు టైటాన్స్‌కు బెంగళూరు బుల్స్ చేతిలో పరాజయం ఎదురైంది. సోమవారం జరిగిన హోరాహోరీ మ్యాచ్‌లో బెంగళూరు 34–32 పాయింట్ల తేడాతో టైటాన్స్‌పై గెలుపొందింది. మ్యాచ్ ముగిసే దశలో అనూహ్యంగా ఆధిక్యాన్ని కోల్పోయిన తెలుగు టైటాన్స్ చివరకు 2 పాయింట్ల తేడాతో ఓడిపోయింది.
టైటాన్స్ జట్టులో ఆల్‌రౌండర్లు భరత్, కెపె్టన్ విజయ్ మలిక్ అదరగొట్టారు. 19 సార్లు కూతకెళ్లిన భరత్ 13 పాయింట్లు తెచ్చిపెట్టాడు. 18 సార్లు రెయిడింగ్ చేసిన విజయ్ 9 పాయింట్లు సాధించాడు. బెంగళూరు తరఫున అలీరెజా మిర్జాయిన్ (11) రాణించాడు.
కీలక తరుణంలో పాయింట్లు చేసి జట్టును గెలిపించాడు. మిగతా వారిలో డిఫెండర్లు యోగేశ్ 3, దీపక్ శంకర్ 2, రెయిడర్ ఆకాశ్ షిండే 2 పాయింట్లు సాధించారు. ఈ సీజన్‌లో 6 మ్యాచ్‌లాడిన తెలుగు జట్టుకిది మూడో పరాజయం.
అంతకుముందు జరిగిన తొలి మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 40–37తో గుజరాత్ జెయింట్స్‌పై గెలుపొందింది. స్టీలర్స్ తరఫున రెయిడర్లు శివమ్ పతారే (12), వినయ్ (8), డిఫెండర్లు జైదీప్ (6), సాహిల్ నర్వాల్ (4), రాహుల్ (3) రాణించారు.
గుజరాత్ జట్టులో రెయిడర్ రాకేశ్ (14) చక్కని పోరాటం చేశాడు. 21 సార్లు కూతకెళ్లిన అతను 14 సార్లు విజయవంతంగా పాయింట్లు తెచ్చాడు. మిగతావారిలో నితిన్ పన్వార్ 3, లక్కీ శర్మ, శుభమ్ కుమార్ చెరో 2 పాయింట్లు చేశారు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో యూపీ యోధాస్, తమిళ్ తలైవాస్‌తో బెంగళూరు బుల్స్ తలపడతాయి.
చదవండి: Asia Cup 2025: శ్రమించి గెలిచిన శ్రీలంక