ప్రోకబడ్డీ లీగ్-2025లో సంచలనం నమోదైంది. సోమవారం రాత్రి ఢిల్లీ వేదికగా పట్నా పైరేట్స్‌తో జరిగిన ఎలిమినేటర్2లో బెంగళూరు బుల్స్ స్టార్ రైడర్ శుభం బిటాకే అద్బుతం చేశాడు. ఒకే రైడ్‌లో ఏడు పాయింట్లు సాధించి అందరిని షాక్‌కు గురిచేశాడు.
ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ ముగిసే సరికి పాట్నా పైరేట్స్ బెంగళూరు బుల్స్ పై 27-13 ఆధిక్యంలో నిలిచింది. దీంతో బెంగళూరుకు ఘోర ఓటమి తప్పదని అంతా భావించారు. కానీ శుభమ్ ఒక్క సంచలన రైడ్‌తో బెంగళూరును తిరిగి గేమ్‌లోకి తీసుకొచ్చాడు.
పాట్నా డిఫెండర్లను చాకచాక్యంగా బురిడీ కొట్టించిన శుభమ్.. ఆరు టచ్ పాయింట్లు, ఒక్క బొనస్ పాయింట్ సాధించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. కానీ ఆఖరిలో రైడర్లు, డిఫెండర్లు చిన్న చిన్న తప్పిదాలు చేయడంతో బెంగళూరు 46-37 తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
చరిత్ర సృష్టించిన శుభమ్..
అయితే ఈ మ్యాచ్‌లో సూపర్ రైడ్‌తో మెరిసిన శుభమ్.. ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రోకబడ్డీ లీగ్ చరిత్రలో ఒకే రైడ్‌లో అత్యధిక వ్యక్తిగత పాయింట్లు సాధించిన ఆటగాడిగా బిటాకే నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు పర్దీప్ నర్వాల్ పేరిట ఉండేది. పీకేఎల్-2017లో పర్దీప్ ఒకే రైడ్‌లో 6 వ్యక్తిగత పాయింట్లు తీసుకొచ్చాడు. వాస్తవానికి ఆ రైడ్‌లో పర్దీప్.. 8 పాయింట్లు సాధించాడు. కానీ అందులో 6 వ్యక్తిగత పాయింట్లు కాగా.. మరో రెండు ఆలౌట్ పాయింట్లు ఉన్నాయి.
చదవండి: PKL 2025: తెలుగు టైటాన్స్‌కు చావో రేవో మ్యాచ్.. ఓడితే పరిస్థితి ఏంటి?


