ప్రోకబడ్డీ లీగ్-2025లో వరుస విజయాలతో దూసుకు పోతున్న తెలుగు టైటాన్స్ కీలక పోరుకు సిద్దమైంది. మంగళవారం(అక్టోబర్ 28) ఢిల్లీ వేదికగా ఎలిమినేటర్-3లో పాట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టైటాన్స్ విజయం సాధిస్తే బుధవారం జరిగే క్వాలిఫయర్-2లో పుణేరి పల్టాన్‌ను ఢీకొట్టనుంది.
ఒకవేళ ఈ చావో రేవో మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ ఓటమి పాలైతే టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. కావరుస విజయాలతో జోరు మీదున్న తెలుగు టైటాన్స్‌కు పాట్నాను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ పైరేట్స్ జట్టులో అయాన్ లోచాబ్, మణీందర్ సింగ్ వంటి అద్బుతమైన రైడర్లు ఉన్నారు. వీరిద్దరూ చెలరేగితే టైటాన్స్‌కు కష్టాలు తప్పవు.
ప్రస్తుత సీజన్‌లో అత్యధిక రైడ్ పాయింట్ల సాధించిన జాబితాలో అయాన్ (294) అగ్రస్దానంలో ఉన్నాడు. అదేవిధంగా పాట్నా డిఫెండర్ నవదీప్ నుంచి కూడా టైటాన్స్ రైడర్స్‌కు కష్టాలు ఎదురుకానున్నాయి. నవదీప్ 68 టాకిల్ పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నారు. వీరిముగ్గురి జోరుకు కళ్లెం వేస్తే తెలుగు టైటాన్స్ విజయం నల్లేరు మీద నడక కానుంది.
అయితే పీకేఎల్-12 వ సీజన్‌లో పాట్నా కంటే టైటాన్స్‌కే మెరుగైన రికార్డు ఉంది. తెలుగు టైటాన్స్ ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడి పదింట విజయం సాధించగా.. పాట్నా 18 మ్యాచ్‌లు ఆడి కేవలం ఎనిమిదింట మాత్రమే విజయం సాధించింది. కానీ ఆరంభంలో తడబడిన పాట్నా.. వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించి ప్లే ఇన్స్‌కు ఆర్హత సాధించడం గమనార్హం.
కాగా తెలుగు టైటాన్స్‌కు కెప్టెన్ విజయ్ మాలిక్, భరత్ హుడా అద్బుతమైన ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే ఆంశంగా చెప్పుకోవాలి. సోమవారం బెంగళూరు బుల్స్‌తో జరిగిన మినీ క్వాలిఫయర్‌లో కూడా వీరిద్దరూ సత్తాచాటారు.
తెలుగు టైటాన్స్ వర్సెస్ పాట్నా పైరేట్స్ స్టార్టింగ్ 7
తెలుగు టైటాన్స్: చేతన్ సాహు, సాగర్, అజిత్ పవార్, విజయ్ మాలిక్ (కెప్టెన్), భరత్ హుడా, శుభమ్ షిండే, అంకిత్.
పాట్నా పైరేట్స్: అంకిత్ కుమార్, దీపక్, బాలాజీ డి, అయాన్ లోహ్చాబ్, మిలన్ దహియా, నవదీప్ అంకిత్ జగ్లాన్ (కెప్టెన్).
చదవండి: దబంగ్ ఢిల్లీ ఫైనల్‌కు


