ఈ ఏడాది ఆసియాకప్‌తో టీ20ల్లో రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్టార్ శుభ్‌మన్ గిల్.. దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. టెస్టు, వన్డే ఫార్మాట్లలో రాణిస్తున్నప్పటికి టీ20ల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. గిల్ తన చివరి పది మ్యాచ్‌లలో 181 పరుగులు మాత్రమే చేశాడు.
అతడి స్ట్రైక్-రేట్ 140 కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లోనూ అతడి పేలవ ఫామ్ కొనసాగుతోంది. తొలి టీ20లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసిన గిల్.. రెండో టీ20ల్లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.
ఎందుకంటే సూపర్ ఫామ్‌లో ఉన్న సంజూను కాదని మరి గిల్‌కు ఛాన్స్ ఇచ్చారు. గిల్ పునరాగమనం ముందువరకు టీ20ల్లో భారత్ ఓపెనింగ్ జోడీ అభిషేక్-సంజూ శాంసన్ ఉండేవారు. కానీ గిల్ రాకతో సంజూకు ప్లేయింగ్ ఎలెవన్‌లోనే చోటు లేకుండాపోయింది. అలా అని గిల్ రాణిస్తున్నాడా అంటే అది లేదు. ఈ నేపథ్యంలో టీమ్ మెనెజ్‌మెంట్‌పై భారత మాజీ కెప్టెన్ రాబిన్ ఊతప్ప ప్రశ్నల వర్షం కురిపించాడు.
శాంసన్ చేసిన తప్పేంటి?
"సంజూ శాంసన్ చేసిన తప్పు ఏంటి? ఎందుకు అతడికి అవకాశమివ్వడం లేదు? అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ జోడీ టీ20ల్లో అద్భుతాలు చేశారు. అటువంటి ఓపెనింగ్ జోడీని బ్రేక్ చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది. ఈ సిరీస్‌కు ముందు సూర్యకుమార్ మాట్లాడుతూ.. సంజూకు అవకాశం రాకముందే శుభ్‌మన్ టీ20 జట్టులో భాగంగా ఉన్నాడని చెప్పుకొచ్చాడు.
ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ సంజూ అవకాశం వస్తే ఏమి చేశాడో మనందరికి తెలుసు. ఓపెనర్‌గా వచ్చి వరుసగా మూడు సెంచరీలు బాదాడు. ప్రస్తుత యువ క్రికెటర్లలో అందరికంటే ముందు సంజూనే చేశాడు. ఆ తర్వాత అభిషేక్, తిలక్ వర్మ సెంచరీలు సాధించారు.
ఓపెనర్‌గా సంజూ తనను తాను నిరూపించుకున్నాడు. అభిషేక్ శర్మ సంజూనే విజయవంతమైన ఓపెనర్‌గా ఉన్నాడు. అయినప్పటికి అతడిని ఓపెనర్‌గా తప్పించారు. ఆ తర్వాత అతడిని మిడిల్ ఆర్డర్‌కు మార్చాలని నిర్ణయించుకున్నారు. ఆపై ఆపై నెమ్మదిగా జట్టు నుండి తొలగించారు. మరోసారి అడుగుతున్న అతడు చేసిన తప్పు ఏంటి? కచ్చితంగా ఓపెనింగ్ స్దానాన్ని అతడు అర్హుడు.
ప్రస్తుతం శుభ్‌మన్ టీ20ల్లో రాణించలేకపోతున్నాడు. తన శైలికి విరుద్దంగా ప్రయత్నించి విఫలమవుతున్నాడు. మొదటిలో అభిషేక్‌తో పోటీపడానికి ప్రయత్నిస్తున్నాడని నేను భావిస్తున్నాను. తడు బ్యాటింగ్ చేసే విధానం ఇది కాదు. అతడు క్రీజులో సెటిల్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకుంటాడు. 15 నుంచి 20 బంతులు ఆడిన తర్వాత అతడిని ఆపడం ఎవరి తరం కాదు. తానంతంట తానే ఔట్ అవ్వాలి. అలా ఆడితే గిల్‌కు టీ20కు సరిపోతుంది" అని ఉతప్ప స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.


