
ఐపీఎల్ తర్వాత ప్రేక్షకాదరణలో రెండో స్థానంలో నిలిచిన ప్రొ కబడ్డీ లీగ్ (PKL) 12వ సీజన్‌కు ముందు ఆటగాళ్ల వేలం ప్రక్రియకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. దబంగ్ ఢిల్లీ స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ (Naveen Kumar) తొలిసారి పీకేఎల్ వేలానికి వచ్చాడు.
అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు
కాగా దబంగ్ ఢిల్లీ (Dabang Delhi) 8వ సీజన్‌లో విజేతగా నిలిచింది. ఈ ఫ్రాంచైజీ తరఫున ఆరు సీజన్లు ఆడిన నవీన్ 1102 రెయిడింగ్ పాయింట్లు సాధించాడు. అలాంటి ఆటగాడిని ఢిల్లీ వదిలేసుకోవడంతో మిగతా ఫ్రాంచైజీలు అతనిపై కన్నేశాయి.
ఇలా విడుదల, అట్టిపెట్టుకున్న ఆటగాళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను 12 ఫ్రాంచైజీలు ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీలు కలిపి 83 మందిని రిటెయిన్ (అట్టిపెట్టుకోవడం) చేసుకున్నాయి.
నాలుగు కేటగిరీలు
మొత్తం నాలుగు కేటగిరీలుగా ఆటగాళ్లను అట్టిపెట్టుకునే వీలుంది. ఎ, బి, సి, డిగా విభజించిన రిటెయినర్లలో ఎ ఆటగాడికి రూ. 30 లక్షలు, బి ప్లేయర్‌కు రూ. 20 లక్షలు, సి, డి ఆటగాళ్లకు వరుసగా రూ. 13 లక్షలు, రూ. 9 లక్షలు చెల్లించాల్సివుంటుంది.
ఒక్కో ఫ్రాంచైజీ గరిష్ట పరిమితి రూ. 5 కోట్లకు లోబడే రిటెయిన్ మొత్తాన్ని తీసివేయగా మిగిలిన మొత్తంతో ఆటగాళ్లను వేలంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ముంబైలో ఈ నెల 31, జూన్ 1 తేదీల్లో రెండు రోజుల పాటు కబడ్డీ ఆటగాళ్ల వేలం పాట జరుగనుంది.
ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ప్లేయర్లు
బెంగాల్ వారియర్స్: విశ్వాస్, యశ్ మలిక్, మన్‌జీత్, దీప్ కుమార్, సుశీల్ కాంబ్రేకర్.
బెంగళూరు బుల్స్: చంద్ర నాయక్, లక్కీ కుమార్, మన్‌జీత్, పంకజ్.
దబంగ్ ఢిల్లీ: సందీప్, మోహిత్.
గుజరాత్ జెయింట్స్: హిమాన్షు సింగ్, హిమాన్షు, ప్రతీక్ దహియా, రాకేశ్.
హరియాణా స్టీలర్స్: రాహుల్ సెప్తాల్, వినయ్, శివమ్ అనీల్, జైదీప్, జయసూర్య, విశాల్ తటే, సాహిల్ మనికందన్, వికాస్ రామదాస్ జాదవ్.
జైపూర్ పింక్‌పాంథర్స్: రెజా మిర్బాఘెరి, అభిషేక్, రోనక్ సింగ్, నితిన్ కుమార్, సోంబిర్, రితిక్ శర్మ.
పట్నా పైరేట్స్: హమిద్ మిర్జాయి నదిర్, త్యాగరాజన్ యువరాజ్, సుధాకర్, అయాన్, నవ్‌దీప్, దీపక్, సాహిల్ పాటిల్.
పుణేరి పల్టన్: అభినేశ్, గౌరవ్ ఖత్రి, పంకజ్ మోహితే, అస్లామ్ ముస్తఫా, మోహిత్ గోయత్, దాదాసొ శివాజీ పూజారి, ఆదిత్య తుషార్ షిండే.
తమిళ్ తలైవాస్: మొయిన్ షఫాగి, హిమాన్షు, సాగర్, నితేశ్ కుమార్, నరేందర్, రోనక్, విశాల్ చహల్, ఆశిష్, అనూజ్ గవాడే, ధీరజ్ రవీంద్ర బైల్మరే.
తెలుగు టైటాన్స్: శంకర్ భీమ్‌రాజ్, అజిత్ పాండురంగ పవార్, అంకిత్, ప్రఫుల్ జవారే, సాగర్ చేతన్ సాహు, నితిన్, రోహిత్.
యు ముంబా: సునీల్ కుమార్, రోహిత్, అమిర్ మొహమ్మద్, సతీశ్ కన్నన్, ముకిలన్ షణ్ముగమ్, అజిత్ చౌహాన్, దీపక్ కుండు, లోకేశ్ గోస్లియా, సన్నీ.
యూపీ యోధాస్: సుమిత్, భవానీ రాజ్‌పుత్, సాహుల్ కుమార్, సురేందర్ గిల్, అషు సింగ్, హితేశ్ గగన గౌడ, శివమ్ చౌదరి, జయేశ్ వికాస్ మహాజన్, గంగారామ్, సచిన్, కేశవ్ కుమార్.