
సౌత్ ఆసియన్ ఫుట్‌బాల్ ఫెడరేషన్(SAFF) అండర్-19 చాంపియన్‌షిప్ విజేతగా భారత్ అవతరించింది. ఆదివారం అరుణాచల్ ప్రదేశ్‌లోని గోల్డెన్ జూబ్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో బంగ్లాను ఓడించి భారత్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్( 4-3)లో యంగ్ ఇండియా విజయం సాధించింది. ముందుగా నిర్ణీత సమయంలో ఇరు జట్లు చెరో గోల్‌తో సమంగా నిలిచారు. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు.
పెనాల్టీ షూటౌట్‌లో కూడా ఆసక్తికరంగా సాగింది. పెనాల్టీ షూటౌట్‌లో 3-3తో సమంగా ఉన్నసమయంలో కెప్టెన్ షమీ సింగమాయుమ్ అద్బుతమైన గోల్ కొట్టి భారత్‌కు అద్బుతమైన విజయాన్ని అందించాడు. భారత్‌కు ఇది రెండవ శాఫ్ అండర్-19 టైటిల్ కావడం విశేషం.
చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లి రికార్డు బ్రేక్