భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్న వైభవ్‌ సూర్యవంశీ, ఆయుశ్‌ మాత్రే | Ayush Mhatre, Suryavanshi Chokers: Fans tear into India U19 stars amid collapse vs Pakistan | Sakshi
Sakshi News home page

భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్న వైభవ్‌ సూర్యవంశీ, ఆయుశ్‌ మాత్రే

Feb 1 2026 3:40 PM | Updated on Feb 1 2026 3:45 PM

Ayush Mhatre, Suryavanshi Chokers: Fans tear into India U19 stars amid collapse vs Pakistan

భారత యువ జట్టు కెరటాలు ఆయుశ్‌ మాత్రే, వైభవ్‌ సూర్యవంశీ సోషల్‌మీడియా వేదికగా భారీ ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. అండర్‌-19 ప్రపంచకప్‌ 2026లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌లో దారుణంగా విఫలమైనందుకు టీమిండియా ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురవుతున్నారు. చోకర్స్‌ అంటూ ట్రోలింగ్‌ చేస్తున్నారు. సూర్యవంశీతో పోలిస్తే మాత్రేపై ట్రోలింగ్‌ ధాటి అధికంగా ఉంది. ప్రతి కీలక మ్యాచ్‌లో విఫలమవుతాడు, ఇతన్ని ఎలా కెప్టెన్‌గా కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు.  

ఈ మ్యాచ్‌లో మాత్రే రెండు బంతులు ఆడి ఖాతా కూడా తెరవలేకపోగా.. చిన్న జట్లపై చెలరేగిపోయే వైభవ్‌ సూర్యవంశీ ​కీలకమైన మ్యాచ్‌లో సత్తా చాటలేకపోయారు. వైభవ్‌ 22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. వాస్తవానికి వైభవ్‌ చేసిన ఈ స్కోర్‌ అంత తీసి పాడేయాల్సిందేమీ కాకపోయినప్పటికీ.. కీలకమైన సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌ కావడం, అందులోనూ ప్రత్యర్ధి పాక్‌ కావడం వల్ల అభిమానులు ఆగ్రహిస్తున్నారు. రెండు లైఫ్‌లు లభించిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోవడంతో ఫ్యాన్స్‌ ఆగ్రహం వైభవ్‌పై కట్టలు తెంచుకుంది.

వీరిద్దరితో పాటు మరో ఓపెనర్‌ ఆరోన్‌ జార్జ్‌ (16) కూడా విఫలం కావడంతో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ కష్టాల్లో పడింది. ఈ ముగ్గురు ఒకే స్కోర్‌ (47 పరుగులు) వద్ద, నాలుగు బంతుల వ్యవధిలో ఔట్‌ కావడం అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. పాక్‌ పేసర్‌ మొహమ్మద్‌ సయ్యమ్‌ భారత టాపార్డర్‌ను కూల్చడంలో సఫలీకృతుడయ్యాడు. 

మరో 62 పరుగుల తర్వాత భారత్‌ మరో వికెట్‌ కోల్పోయింది. 109 పరుగుల వద్ద విహాన్‌ మల్హోత్రా (21) అహ్మద్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో అతనికే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 30 ఓవర్ల తర్వాత భారత్‌ 4 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసి ఎదురీదుతుంది. వేదాంత్‌ త్రివేది (50), అభిగ్యాన్‌ కుందు (12) భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్‌ అందించే ప్రయత్నం చేస్తున్నారు.

కెప్టెన్సీ నుంచి తీసేయండి..!
ఇటీవలికాలంలో ఆయుశ్‌ మాత్రే ప్రదర్శలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచకప్‌లో అతను ఇప్పటివరకు 99 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 53 పరుగులు న్యూజిలాండ్‌పై చిన్న లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వచ్చాయి. దీనికి ముందు ఆసియా కప్‌లోనూ అతని ప్రదర్శనలు దారుణంగా ఉన్నాయి. ఆ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 65 పరుగులు మాత్రమే చేశాడు. వరుస వైఫల్యాల నేపథ్యంలో మాత్రేను కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement