పాక్‌తో మ్యాచ్‌.. తొలుత బ్యాటింగ్ చేయ‌నున్న భార‌త్‌ | IND U19 vs PAK U19 playing XI: Focus on Vaibhav Suryavanshi, Ayush Mhatre | Sakshi
Sakshi News home page

World cup: పాక్‌తో మ్యాచ్‌.. తొలుత బ్యాటింగ్ చేయ‌నున్న భార‌త్‌

Feb 1 2026 12:50 PM | Updated on Feb 1 2026 2:25 PM

IND U19 vs PAK U19 playing XI: Focus on Vaibhav Suryavanshi, Ayush Mhatre

అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో మ‌రో హైవోల్టేజ్ మ్యాచ్‌కు తెరలేచింది. సూప‌ర్ సిక్స్‌లో భాగంగా బులవాయో వేదిక‌గా భారత్-పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీల‌క మ్యాచ్‌కు పాక్ ఆట‌గాడు మహ్మద్‌ షయాన్ గాయం కార‌ణంగా దూర‌మ‌య్యాడు.

అత‌డి స్దానంలో అలీ హసన్ బలోచ్‌కు తుది జ‌ట్టులో చోటు ద‌క్కింది. మ‌రోవైపు భార‌త్ కూడా త‌మ తుది జ‌ట్టులో ఓ మార్పు చేసింది. ఉద‌వ్ మోహ‌న్ స్దానంలో దీపేష్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి వ‌చ్చాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ఆసియాక‌ప్ ఫైన‌ల్లో ఎదురైన ప‌రాభావానికి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని భార‌త్ భావిస్తోంది.

తుది జ‌ట్లు
పాకిస్తాన్: సమీర్ మిన్హాస్, హంజా జహూర్ (వికెట్ కీప‌ర్‌), ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్ (కెప్టెన్‌), హుజైఫా అహ్సన్, అలీ హసన్ బలోచ్, అబ్దుల్ సుభాన్, మోమిన్ కమర్, మొహమ్మద్ సయామ్, అలీ రజా

భార‌త్‌ : ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్‌), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్‌), అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీప‌ర్‌), వేదాంత్ త్రివేది, ఆర్ ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్

Advertisement
 
Advertisement
Advertisement