ప్రొ కబడ్డీ లీగ్‌-2024 ఛాంపియన్స్‌గా హరియాణా స్టీలర్స్‌ | Haryana Steelers lift maiden PKL title | Sakshi
Sakshi News home page

ప్రొ కబడ్డీ లీగ్‌-2024 ఛాంపియన్స్‌గా హరియాణా స్టీలర్స్‌

Dec 29 2024 9:06 PM | Updated on Dec 29 2024 9:29 PM

Haryana Steelers lift maiden PKL title

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)–11వ సీజన్‌ ఛాంపియన్స్‌గా హరియాణా స్టీలర్స్‌ నిలిచింది. ఆదివారం ముంబై వేదికగా జరిగిన ఫైనల్‌లో పాట్నా పైరేట్స్‌ను 32-23 తేడాతో చిత్తు చేసిన హరియాణా.. తొలిసారి పీకేఎల్‌ ట్రోఫీని ముద్దాడింది.

హరియాణా విజేతగా నిలవడంలో శివం పటారే కీలక పాత్ర పోషించాడు. శివం పటారే ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టాడు. 21 ఏళ్ల పటారే నాలుగు టాకిల్స్‌ పాయింట్స్‌, ఐదు టచ్‌ పాయింట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు మొహమ్మద్రెజా షాడ్లోయ్ 5 టాకిల్స్‌తో ప్రత్యర్ధి జట్టును ఉక్కిరి బిక్కిరి చేశాడు. 

మరోవైపు రన్నరప్‌గా నిలిచిన పాట్నా పైరేట్స్‌లో రైడర్‌ దేవాంక్‌(5 టచ్‌ పాయింట్లు), గురుదీప్‌​ సింగ్‌(6 టాకిల్‌ పాయంట్లు) మినహా మిగితా అందరూ తీవ్ర నిరాశపరిచారు. ఇక​ టోర్నీ అసాంతం హరియాణా అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ మెగా ఈవెంట్‌లో 22 మ్యాచ్‌లు ఆడిన హరియాణా 16 విజయాలు సాధించగా.. ఆరింట ఓటమి చవిచూసింది. ప్రొ కబడ్డీ లీగ్‌-2024 సీజన్‌ ఆరంభం నుంచి ఆఖరి వరకు టేబుల్‌ టాపర్‌గానే హరియాణా(84 పాయింట్లు) కొనసాగింది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement