
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో ఘనవిజయంతో హరియాణా స్టీలర్స్... ఓటమి పాలైనప్పటికీ మెరుగైన పాయింట్లతో జైపూర్ పింక్‌పాంథర్స్ జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 50–32తో గుజరాత్ జెయింట్స్‌పై నెగ్గింది. స్టీలర్స్ రెయిడర్లు శివమ్ (17), వినయ్ (14) రాణించారు. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 37–36తో జైపూర్ పింక్‌పాంథర్స్‌పై గెలుపొందింది.
ఫలితం పింక్‌పాంథర్స్‌ను నిరాశపరిచినప్పటికీ హరియాణా జట్టులాగే 8 విజయాలు, 16 పాయింట్లతో సమంగా నిలువడంతో జైపూర్‌కూ ప్లేఆఫ్స్ బెర్త్ దక్కింది. మొదటి మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 44–43తో తమిళ్ తలైవాస్‌పై గెలిచింది. ఇప్పటికే ఏడు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరగా చివరి బెర్త్ కోసం పట్నా పైరేట్స్ రేసులో ఉంది.