టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. వైజాగ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. అందరూ ఊహించినట్టుగానే ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడింది.
కానీ తొలి రెండు వన్డేల్లో దారుణంగా విఫలమైన పేసర్ ప్రసిద్ద్ కృష్ణపై మాత్రం టీమ్ మెనెజ్‌మెంట్ నమ్మకం ఉంచింది. కానీ గంభీర్ నమ్మకాన్ని ఈ కర్ణాటక పేసర్ తొలి స్పెల్‌లో నిలబెట్టుకోలేకపోయాడు. మొదటి స్పెల్‌లో 2 ఓవర్లు వేసిన కృష్ణ ఏకంగా 13.5 ఏకానమీతో 27 పరుగులు ఇచ్చాడు.
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 9 ఓవర్‌లో తన తొలి స్పెల్‌ను వేసేందుకు వచ్చిన ప్రసిద్ద్ కృష్ణను క్వింటన్ డికాక్ ఓ ఆడుకున్నాడు. దీంతో గంభీర్‌తో పాటు కృష్ణను సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. అతడు తప్ప ఇంకొక బౌలర్ మీకు దొరకలేదా అంటూ నెటిజన్లు మండిడ్డారు.
సీన్ రివర్స్..
అయితే కాసేపటికే ప్రసిద్ద్, గంభీర్‌ను విమర్శించిన వారే శెభాష్ అంటూ ప్రశంసించారు. ప్రసిద్ద్ కృష్ణ తన సెకెండ్ స్పెల్‌లో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్యాడు. ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లను పడగొట్టి సఫారీలను దెబ్బతీశాడు. 29వ ఓవర్ వేసిన కృష్ణ రెండో బంతికి ఇన్ ఫామ్ బ్యాటర్ బ్రీట్జ్కేను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించిన కృష్ణ.. ఆఖరి బంతికి రాయ్‌పూర్ వన్డే హీరో మార్‌క్రమ్‌ను పెవిలియన్‌కు పంపాడు.
ఆ తర్వాత డికాక్‌ను కూడా అద్భుత బంతతో క్లీన్ బౌల్డ్ చేశాడు. ప్రసిద్ద్ తన సూపర్ బౌలింగ్‌తో తిరిగి జట్టును గేమ్‌లోకి తెచ్చాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న సౌతాఫ్రికా 38 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్(106) సెంచరీతో మెరిశాడు.
What a brilliant comeback by Prasidh Krishna 👏🏻
First 2 overs - 28 runs and 0 wickets 😆
Next 5 overs - 25 runs and 3 wickets 🔥 pic.twitter.com/wPIluvIgVS— Richard Kettleborough (@RichKettle07) December 6, 2025


