
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 40–31 పాయింట్ల తేడాతో పట్టిక అగ్రస్థానంలో ఉన్న పుణేరి పల్టన్‌పై గెలిచి ముందంజ వేసింది. టైటాన్స్ తరఫున భరత్ 11, విజయ్ మాలిక్ 10 పాయింట్లు సాధించారు.
ఈ సీజన్‌లో టైటాన్స్ 16 మ్యాచ్‌లాడి 9 విజయాలు, 7 పరాజయాలతో 18 పాయింట్లతో నిలిచింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 33–23 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీపై గెలుపొందింది. ఈ విజయంతో బెంగళూరు బుల్స్ కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇంకో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 38–30 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌పై గెలుపొందింది.