అశు రెయిడింగ్‌ అదుర్స్‌ | Dabang Delhi win over Bengaluru Bulls | Sakshi
Sakshi News home page

అశు రెయిడింగ్‌ అదుర్స్‌

Nov 17 2024 4:02 AM | Updated on Nov 17 2024 4:02 AM

Dabang Delhi win over Bengaluru Bulls

14 పాయింట్లతో మెరిసిన దబంగ్‌ ఢిల్లీ స్టార్‌

నోయిడా: స్టార్‌ రెయిడర్‌ అశు మలిక్‌ 14 పాయింట్లతో సత్తా చాటడంతో... ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) 11వ సీజన్‌లో దబంగ్‌ ఢిల్లీ ఐదో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో దబంగ్‌ ఢిల్లీ జట్టు 35–25 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. 12 రెయిడ్‌ పాయింట్లు, 2 బోనస్‌ పాయింట్లతో అశు మలిక్‌ విజృంభించగా... అతడికి డిఫెన్స్‌లో యోగేశ్‌ దహియా (5 పాయింట్లు) సహకరించాడు. 

బెంగళూరు బుల్స్‌ తరఫున నితిన్‌ రావల్‌ 7 పాయింట్లు సాధించగా... స్టార్‌ రెయిడర్‌ ప్రదీప్‌ నర్వాల్‌ 5 పాయింట్లకే పరిమితమయ్యాడు. ఫలితంగా మ్యాచ్‌ ఏ దశలోనూ బెంగళూరు జట్టు ఢిల్లీకి పోటీనివ్వలేకపోయింది. తాజా సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన దబంగ్‌ ఢిల్లీ 5 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 32 పాయింట్లు ఖాతాలో వేసుకొని ఐదో స్థానానికి ఎగబాకింది. పది మ్యాచ్‌ల్లో 8వ పరాజయంతో బెంగళూరు జట్టు పట్టికలో 11వ స్థానానికి పరిమితమైంది. 

మరో మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ 46–31 పాయింట్ల తేడాతో బెంగాల్‌ వారియర్స్‌పై గెలుపొందింది. తలైవాస్‌ తరఫున విశాల్‌ 12 పాయింట్లతో రాణించగా... బెంగాల్‌ తరఫున విశ్వాస్‌ 9 పాయింట్లు సాధించాడు. లీగ్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన తమిళ్‌ తలైవాస్‌ 4 విజయాలు, 5 పరాజయాలు, ఒక ‘టై’తో 27 పాయింట్లు సాధించి ఏడో స్థానంలో ఉంది. నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో హరియాణా స్టీలర్స్‌తో తమిళ్‌ తలైవాస్‌ (రాత్రి 8 గంటలకు), జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో పుణేరి పల్టన్‌ (రాత్రి 9 గంటలకు) తలపడనున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement