
యూపీ యోధాస్‌పై బెంగాల్‌దే పైచేయి
జైపూర్: వైఫల్యాలతో సతమతమవుతున్న మాజీ చాంపియన్ బెంగాల్ వారియర్స్... ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో ఎట్టకేలకు గెలుపుబాట పట్టింది. మంగళవారం జరిగిన పోరులో 41–37తో యూపీ యోధాస్‌పై గెలుపొందింది. 2019 సీజన్ చాంపియన్ వారియర్స్ నాలుగు వరుస పరాజయాల తర్వాత మళ్లీ విజయం సాధించింది.
ఆరు మ్యాచ్‌లాడిన బెంగాల్‌కు ఇది రెండో విజయం మాత్రమే! ఈ మ్యాచ్‌లో వారియర్స్ కెపె్టన్ దేవాంక్ (17 పాయింట్లు) తనదైన శైలిలో రాణించాడు. మిగతా వారిలో ఆశిష్ (6), మన్‌ప్రీత్ (5), పార్థిక్ (3) మెరుగ్గా ఆడారు. యూపీ తరఫున రెయిడర్లు గగన్ గౌడ (7), గుమన్ సింగ్ (5), డిఫెండర్లు అçశు సింగ్, హితేశ్ చెరో 4 పాయింట్లు స్కోరు చేశారు.
రెండో మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ 35–29తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. తమిళ్ తరఫున అర్జున్ (13), నరేందర్ (5), రోనక్ (4) బాగా ఆడారు. నేడు జరిగే పోటీల్లో తెలుగు టైటాన్స్‌తో దబంగ్ ఢిల్లీ, హరియాణా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి.