
ఒకే రెయిడ్‌లో 6 పాయింట్లు సాధించిన యు ముంబా ప్లేయర్
విశాఖ, స్పోర్ట్స్: యు ముంబా రెయిడర్ అజిత్ చౌహన్ సంచలన ప్రదర్శనతో తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబా ఏకంగా 20 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ను చిత్తు చేసింది. శుక్రవారం ఏకపక్షంగా సాగిన పోరులో ముంబా 48–28తో బెంగళూరు బుల్స్‌పై ఘన విజయం సాధించింది. అజిత్ చౌహాన్ ఒక్కడే 13 పాయింట్లతో అదరగొట్టాడు. 13వ నిమిషంలో అజిత్ సంచలన ప్రదర్శన కనబర్చాడు.
ఒకే రెయిడ్‌లో అతను ఏకంగా ఆరుగురు ఆటగాళ్లను అవుట్ చేయడం విశేషం. పీకేఎల్ చరిత్రలో ఒకే రెయిడ్‌లో ఆరు లేదా అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించిన మూడో ప్లేయర్‌గా అజిత్ నిలిచాడు. గతంలో పట్నా పైరేట్స్ తరఫున ప్రదీప్ నర్వాల్ (ఒకే రెయిడ్‌లో 8 పాయింట్లు; 2017లో హరియాణా స్టీలర్స్‌పై)... తమిళ్ తలైవాస్ తరఫున అజింక్య పవార్ (ఒకే రెయిడ్‌లో 6 పాయింట్లు; 2022లో తెలుగు టైటాన్స్‌పై) ఈ ఘనత సాధించారు.
మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్ 37–32తో యూపీ యోధాస్‌ను ఓడించింది. హరియాణా ఆటగాళ్ళలో నవీన్ కుమార్, రాహుల్ చెరో 6 పాయింట్లు నమోదు చేయగా, యూపీ తరఫున గగన్ గౌడ 13 పాయింట్లు స్కోర్ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో బెంగళూరు బుల్స్, తమిళ్ తలైవాస్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడతాయి.