
ప్రో కబడ్డీ లీగ్ (PKL) సీజన్ 12 నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఇవాళ (ఆగస్టు 29) ఘనంగా ప్రారంభమైంది. వైజాగ్‌లోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ వేడుకకు భారత క్రికెట్ యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు.
Vaibhav Sooryavanshi is all set for tonight’s PKL opening clash on National Sports Day! 💪🏽🔥 pic.twitter.com/ypXp0JcWRB
— Johns. (@CricCrazyJohns) August 29, 2025
ఇవాళ సాయంత్రమే వైభవ్ విశాఖ నగరానికి చేరుకున్నాడు. నిర్వహకులు అతడికి ఘన స్వాగతం పలికారు. వేడక ప్రారంభానికి ముందు వైభవ్ కాసేపు కబడ్డీ క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత కొద్ది సేపు కబడ్డీ కూడా ఆడాడు. అనంతరం వైభవ్ చేతుల మీదుగా ఈవెంట్ లాంచ్ అయ్యింది.
ఈ సందర్భంగా వైభవ్ మాట్లాడుతూ.. క్రీడలు మనకు క్రమశిక్షణ, టీమ్‌వర్క్ నేర్పిస్తాయి. నేషనల్ స్పోర్ట్స్ డే నాకు స్పూర్తిదాయకం అని వ్యాఖ్యానించాడు. ఈ వేడుకలో కబడ్డీ దిగ్గజం పర్దీప్ నర్వాల్‌కు (డుబ్కీ కింగ్) ప్రత్యేక సన్మానం జరిగింది. డుబ్కీ కింగ్ PKL చరిత్రలో అత్యధిక రైడ్ పాయింట్లు (1801) సాధించిన ఆటగాడు.
సిక్సర్ల వీరుడు వైభవ్ సూర్యవంశీ, కబడ్డీ కింగ్ పర్దీప్ నర్వాల్‌ను ఒకే వేదికపై కనిపించడంతో క్రికెట్, కబడ్డీ అభిమానులు చాలా ఎంజాయ్ చేశారు. అతి చిన్న వయసులోనే వైభవ్ కబడ్డీని ప్రమోట్ చేయడం చాలామందికి నచ్చింది. వైభవ్‌ను చూసేందుకు విశాఖ వాసులు ఎగబడ్డారు.
8 గంటలకు ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, తమిళ్ తలైవాస్ పోటీపడుతున్నాయి. అనంతరం 9 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్, పుణేరీ పల్టన్ తలపడతాయి.
ఈ సీజన్‌లో టైబ్రేకర్ విధానం, ప్లే-ఇన్ దశ, నాలుగు నగరాల్లో మ్యాచ్‌లు వంటి కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి.
వైభవ్ 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో సంచలనాలు సృష్టించి, క్రికెట్‌తో పాటు యావత్ క్రీడా ప్రపంచాన్నంతా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన విషయం తెలిసిందే. 2025 ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసిన వైభవ్.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతుల్లోనే 101 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఆ సీజన్ మొత్తం మెరుపులు మెరిపించిన వైభవ్ 7 ఇన్నింగ్స్‌ల్లో 206.56 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు చేశాడు.