అండర్–14, 17 జిల్లా కబడ్డీ, ఖోఖో జట్ల ఎంపిక ఈ నెల 5,6 తేదీల్లో స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా స్కూల్‌గేమ్స్ కార్యదర్శి నారాయణ తెలిపారు.
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–14, 17 జిల్లా కబడ్డీ, ఖోఖో జట్ల ఎంపిక ఈ నెల 5,6 తేదీల్లో స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా స్కూల్‌గేమ్స్ కార్యదర్శి నారాయణ తెలిపారు. అండర్–17 బాల, బాలికల కబడ్డీ ఎంపిక ఈ నెల 5న జరుగుతుందని, అండర్–14, 17 ఖోఖో బాల, బాలికల జట్ల ఎంపిక ఈ నెల 6న జరుగుతుందన్నారు.
అండర్–14 విభాగానికి వచ్చే క్రీడాకారులు 1.1.2003 తరువాత జన్మించి ఉండి 6,7,8 తరగతులు చదువుతున్న వారు మాత్రమే అర్హులన్నారు. అండర్–17 విభాగానికి వచ్చే క్రీడాకారులు 1.1.2000 తరువాత జన్మించి ఉండి 9,10 తరగతులు చదువుతున్న వారు మాత్రమే అర్హులన్నారు.