కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ రద్దు | Krishna District Kabaddi Association Canceled | Sakshi
Sakshi News home page

May 20 2018 6:13 PM | Updated on Jul 23 2018 9:15 PM

Krishna District Kabaddi Association Canceled - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విజయవాడ : విమర్శల నేపథ్యంలో కృష్ణా జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ను స్వచ్చందంగా రద్దు చేసి పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు అధ్యక్షుడు కేఈ ప్రభాకర్‌ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. క్రీడాకారులను లైంగికంగా వేధిస్తున్నారని మీడియాకి చెప్పి అల్లరి చేయడం తగదన్నారు. ఏదైనా సమస్య ఉంటే అంతర్గంత చర్చించుకోవాలన్నారు. వీర్ల లంకయ్యకి, జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీకాంత్‌కి మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయని, ఈనేపథ్యంలో వారు అసోసియేషన్‌ను పావుగా వాడుకున్నారని ఆరోపించారు. ఈ వివాదాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. అసోసియేషన్‌ మద్దతు వల్లే క్రీడాకారులు రాణిస్తున్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement