కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ | Tdp Rebels Shock To Gannavaram And Pamarru Mlas | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ

Nov 8 2026 9:15 AM | Updated on Nov 8 2026 9:26 AM

Tdp Rebels Shock To Gannavaram And Pamarru Mlas

సాక్షి, కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలింది. గన్నవరం, పామర్రు ఎమ్మెల్యేలకు టీడీపీ రెబల్స్‌ షాకిచ్చారు. పామర్రు నియోజకవర్గం మొవ్వ మండల జడ్పీటీసీగా టీడీపీ రెబల్ అభ్యర్థి  నన్నపనేని వీరేంద్ర గెలుపొందారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో మొవ్వ జడ్పీటీసీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా టీడీపీ రెబల్ అభ్యర్థి వీరేంద్ర బరిలోకి దిగారు. 6668 ఓట్ల మెజారిటీతో వీరేంద్ర విజయం సాధించారు. వీరేంద్ర గెలుపుతో పామర్రు టీడీపీ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కంగుతిన్నారు.

గన్నవరం నియోజవర్గంలో కూడా టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు టీడీపీ రెబల్స్‌ షాకిచ్చారు. టికెట్లు దక్కకపోవడంతో కేసరపల్లి 1, కేసరపల్లి 2 ఎంపీటీసీ సెగ్మెంట్ల నుంచి టీడీపీ రెబల్స్ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు. కేసరపల్లి సెగ్మెంట్ -1  ఇండిపెండెంట్ అభ్యర్థి యారగాని రత్తయ్య 557 ఓట్లతో విజయం సాధించగా, కేసరపల్లి సెగ్మెంట్ -3 ఇండిపెండెంట్ అభ్యర్థి సొంఠి కిషోర్ బాబు 438 ఓట్లతో విజయం సాధించారు. కృష్ణాజిల్లా టీడీపీలో రెబల్స్ విజయాలు చర్చనీయాంశంగా మారాయి.

ఇదీ చదవండి: కూటమికి ఇదే కౌంట్‌డౌన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement