డాక్టర్ లావణ్య(ఫైల్)
నెల్లూరు(అర్బన్): మాగుంట లేఅవుట్‌లోని ఎనెల్ స్పెషాలిటీ ఆస్పత్రి డైరెక్టర్, న్యూరాలజిస్ట్ కుంకాల లావణ్య(31) బ్రెయిన్ స్ట్రోక్‌తో శనివారం హఠాన్మరణం చెందారు. ఆమె తక్కువ ఫీజులతోనే వైద్యం చేసే వ్యక్తిగా మంచి పేరు తెచ్చుకున్నారు. వారం రోజుల క్రితమే జైపూర్ వేదికగా జరిగిన 33వ ఇండియన్ అకాడమి ఆఫ్ న్యూరాలజీ వార్షిక సదస్సులో లావణ్య సమర్పించిన వ్యాసా నికి ప్రశంసలు అందాయి. ఈ క్రమంలో ఆమె మృతి పట్ల ఏపీ హంస జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌రావు, సెక్రటరీ కమల్‌కిరణ్‌లు తమ సంతాపాన్ని తెలిపారు. చిన్న వయస్సులోనే మృతిచెందడం బాధాకరమన్నారు. ఆమె భర్త డాక్టర్ నాగేంద్రకు, ఎనెల్ ఆస్పత్రి చైర్మన్, తండ్రి అయిన కుంకాల దశరథనాగేంద్ర ప్రసాద్‌లకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.


