ప్రజాతీర్పును శాసించిన తహసీల్దార్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజాతీర్పును శాసించిన తహసీల్దార్‌

Nov 8 2026 5:29 AM | Updated on Nov 8 2026 5:29 AM

● ఫలితాలను తారుమారు చేసిన వైనం

● పీకేపాడు ఎంపీటీసీ, అనంతసాగరం జెడ్పీటీసీ స్థానాల్లో గెలుపొందిన

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు

● రిటర్నింగ్‌ అధికారిని బెదిరించి..

చెల్లని ఓట్లుగా మార్చి టీడీపీని గెలిపించారు

ఆత్మకూరు: అనంతసాగరం తహసీల్దార్‌ వీరవసంతరాయులు ప్రజాతీర్పును శాసిస్తూ.. ఫలితాలను తారుమారు చేసేందుకు బరితెగించారు. పీకేపాడు ఎంపీటీసీ, అనంతసాగరం జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలుపొందినట్లు రిటర్నింగ్‌ అధికార బోర్డుపై ప్రకటించారు. అయితే తహసీల్దార్‌ ఆర్వోను బెదిరించి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఇవ్వనీయకుండా అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీకి పడిన ఓట్లను చెల్లని ఓట్లుగా మార్చేసి టీడీపీ అభ్యర్థులు గెలుపొందినట్లు డిక్లరేషన్‌ అందించారు. అనంతసాగరం మండలం పడమటికంభంపాడు ఎంపీటీసీ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెంకటకృష్ణారెడ్డి 44 మెజార్టీతో గెలిచినట్లు ఆర్వో బోర్డుపై ప్రకటించారు. అయితే ఆయన గెలుపును అడ్డుకుని టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు డిక్లరేషన్‌ ఇప్పించడంతో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు వెలుపలికి వచ్చి ఆందోళన చేశారు.

అరాచకానికి పరాకాష్ట..

అనంతసాగరం జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అమరావతి 1000 ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఏఆర్‌ఓగా విధులు నిర్వహిస్తున్న తహసీల్దారు వీరవసంతరావు 979 ఓట్లు చెల్లనివిగా ప్రకటించి టీడీపీ అభ్యర్థిని గెలుపొందినట్లు ప్రకటించారు. శనివారం రాత్రి పలుమార్లు అనంతసాగరం జెడ్పీటీసీ ఎన్నిక కౌంటింగ్‌ను నిలుపుదల చేస్తూ ఎట్టకేలకు 9 గంటల సమయంలో టీడీపీ అభ్యర్థి మెట్టుకూరు శిరీషా 392 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు, నాయకులు కౌంటింగ్‌ కేంద్రం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. 979 ఓట్లను ఏ కారణంతో తిరస్కరించారో తహసీల్దారు వీర వసంతరావు సమాధానం చెప్పాలని కౌంటింగ్‌ కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. అయితే వారిని పోలీసులు వెలుపలికి పంపించి వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement