● తొమ్మిది ఎంపీటీసీ..
జెడ్పీటీసీ స్థానం కై వశం
వింజమూరు(ఉదయగిరి): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వింజమూరు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలకు గానూ తొమ్మిది చోట్ల విజయకేతనాన్ని ఎగురవేసింది. జెడ్పీటీసీ స్థానాన్నీ కై వశం చేసుకుంది. 2944 ఓట్ల మెజార్టీతో పల్లాల కొండారెడ్డి విజయం సాధించారు. టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే ఓటర్లు పట్టం కట్టారు.
విజేతలు వీరే..
బుక్కాపురంలో చిలకల మహేష్ 364.. కాటేపల్లిలో భోగిరెడ్డి కృష్ణవేణి 415.. గుండెమడకలలో చీమల బలరామిరెడ్డి 431.. వింజమూరు బిట్ – 2లో హబీబున్నీసా 472.. బిట్ – 3లో గణపం బాలకృష్ణారెడ్డి 428.. బిట్ – 4 రేవునూరి అనూష 898.. బిట్ – 5లో గుండ్లపల్లి లక్ష్మీనారాయణ 111.. బిట్ – 6లో పద్మ 532.. శంఖవరంలో గంగపట్ల తిరుపాలు 33 ఓట్లతో విజయం సాధించారు.
నూతనోత్సాహం
విజయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. మరోవైపు టీడీపీ కేడర్ డీలాపడింది. విజయం సాధించిన స్థానాల్లోనూ మెజార్టీ స్వల్పంగా ఉండటం ఆ పార్టీని కలవరపెడుతోంది. మండల నేతలు, కార్యకర్తలకు అభినందనలను పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి తెలియజేశారు. గణపం బాలకృష్ణారెడ్డి, పల్లాల కొండారెడ్డిని అభినందించారు.
బలరామిరెడ్డి
హబీబున్నీసా
మహేష్
కృష్ణవేణి
పల్లాల కొండారెడ్డి


