తీరు మారని ఖాకీలు | - | Sakshi
Sakshi News home page

తీరు మారని ఖాకీలు

Nov 8 2026 5:29 AM | Updated on Nov 8 2026 5:29 AM

● మేకపాటి విక్రమ్‌రెడ్డిని

మరోసారి అడ్డుకున్న వైనం

ఆత్మకూరు: నియోజకవర్గంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్‌ ప్రక్రియను పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ తరుణంలో అనంతసాగరం, ఏఎస్‌పేట మండలాల జెడ్పీటీసీల కౌంటింగ్‌లో జాప్యం జరగడం, పలు అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనే సమాచారంతో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి కేంద్రం వద్దకొస్తుండగా, బీఎస్సార్‌ సెంటర్‌లో ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అక్రమాలను ఎస్సై జంపానికుమార్‌కు మేకపాటి విక్రమ్‌రెడ్డి వివరిస్తున్నా, పట్టించుకోకుండా పార్టీ కేడర్‌ను పంపేశారు. మంత్రి అండదండలతోనే అధికారులు, పోలీసులు కుమ్మకై ్క టీడీపీకి అనుకూలంగా కౌంటింగ్‌ను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేయనున్నామని ప్రకటించారు.

మెడికల్‌ కళాశాలకు

అదనంగా 15 పీజీ సీట్లు

నెల్లూరు(అర్బన్‌): నగరంలోని ఏసీఎస్సార్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు అదనంగా 15 పీజీ సీట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులను నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ శనివారం జారీ చేసింది. 2024 నాటికి పలు దఫాలుగా 56 మెడికల్‌ సీట్లను మంజూరు చేశారు. వీటికి తోడు ఇప్పుడు రేడియాలజీ విభాగానికి మూడు.. ఈఎన్టీ, ప్యాథాలజీ, డెర్మటాలజీ విభాగానికి నాలుగు చొప్పున పీజీ సీట్లొచ్చాయి. ప్రస్తుతం 71 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రతి విభాగంలో స్పెషలిస్టుల సేవలు రోగులకు అందుబాటులోకి రానున్నాయి. జనరల్‌ మెడిసిన్‌, చెవి, ముక్కు, గొంతు, చర్మ, సర్జరీ, ఆర్థోపెడిక్‌, పల్మనాలజీ, గైనకాలజీ, పీడియాట్రిక్‌ ఇలా పలు విభాగాల్లో రోగులకు నాణ్యమైన వైద్యసేవలందనున్నాయి.

శ్రీవారి దర్శనానికి నాలుగు గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 65,467 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 22,462 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి నాలుగు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

సోమశిలలో

19.75 టీఎంసీలు

సోమశిల: సోమశిల జలాశయంలో శనివారం సాయంత్రానికి 19.75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 296 క్యూసెక్కుల వరద వస్తోంది. 72 క్యూసెక్కులు ఆవిరవుతోంది. పెన్నా డెల్టాకు 50 క్యూసెక్కుల నీరు లీకవుతోంది. 88.218 మీటర్ల నీటిమట్టం నమోదైంది.

రంగడి సన్నిధిలో దీపావళి వేడుక నేడు

నెల్లూరు(బృందావనం): దీపావళి పండగ సందర్భంగా రంగనాయకులపేటలోని శ్రీదేవీ, భూదేవీ సమేత తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో ఆదివారం ఉదయం 8 గంటలకు స్వామివారికి తిరుమంజనం, సాయంత్రం 4.30 గంటలకు పేట ఉత్సవం జరుగుతుందని ఈఓ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్‌ లెక్కల వెంకటరెడ్డి శనివారం తెలిపారు. భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement