వైఎస్సార్సీపీకి తగ్గని ప్రజాదరణ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీకి తగ్గని ప్రజాదరణ

Nov 8 2026 5:29 AM | Updated on Nov 8 2026 5:29 AM

● 65 ఎంపీటీసీ స్థానాలు కై వశం

నెల్లూరు(పొగతోట): జిల్లాలోని ఓటర్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపే ఉన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపులో ఇదే విషయం స్పష్టమైంది. అధికార పార్టీ విజయం సాధించిన ఎంపీటీసీ స్థానాల్లో ఎక్కువ చోట్ల స్వల్ప ఓట్ల తేడాతోనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. అనేక సెగ్మెంట్లలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారని ఆర్వోలు ప్రకటించారు. అయితే దీన్ని జిర్ణించుకోలేని టీడీపీ నేతలు రకరకాల ఒత్తిళ్లకు గురిచేసి రీకౌంటింగ్‌కు పట్టుబట్టారు. ఒకట్రెండు ఓట్లతో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారని ప్రకటించారు. 35 జెడ్పీటీసీలకు గానూ 30, 440 ఎంపీటీసీలకు గానూ 362 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో 65 సెగ్మెంట్లలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 221 స్థానాల్లో టీడీపీ, ఎనిమిది చోట్ల జనసేన, మూడింట్లో బీజేపీ, ఇతరులు ఏడుగురు విజయం సాధించారు. వింజమూరు జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విజయకేతనాన్ని ఎగురవేశారు.

అర్ధరాత్రి దాటినా సాగిన లెక్కింపు

ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌ అర్ధరాత్రి దాటినా కొనసాగింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు మొదటి రౌండ్‌లో లీడింగ్‌లో ఉంటే గంటల తరబడి లెక్కింపు ప్రక్రియను నిలిపేశారు.

పోస్టల్‌ బ్యాలెట్‌

వినియోగించడం రాని ఉద్యోగులు

ఎన్నికల్లో సుమారు 10,800 మంది ఉద్యోగులు తమ ఓటును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకున్నారు. అయితే ఎలా ఓటేయాలో కొంత మందికి తెలియలేదు. ఫలితంగా 170 మంది ఓట్లు చెల్లకుండాపోయాయి. వరికుంటపాడు, చేజర్ల, ఆత్మకూరు, కలిగిరి మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement