కామాక్షితాయి ఆలయానికి రూ.56.68 లక్షల రాబడి | - | Sakshi
Sakshi News home page

కామాక్షితాయి ఆలయానికి రూ.56.68 లక్షల రాబడి

Nov 8 2026 5:29 AM | Updated on Nov 8 2026 5:29 AM

బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడలో ఉన్న కామాక్షితాయి అమ్మవారి దేవస్థానంలో హుండీ కానుకల లెక్కింపు శనివారం నిర్వహించారు. 2026 ఆగస్టు 4 నుంచి నవంబర్‌ 6వ తేదీ వరకు 95 రోజుల వ్యవధిలో భక్తులు సమర్పించిన కానుకలను దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో లెక్కించారు. ప్రధాన ఆలయ హుండీల ద్వారా రూ.53,68,476 నగదుతో పాటు అమెరికా డాలర్లు 11, థాయ్‌ బాట్‌ 160, సింగపూర్‌ డాలర్లు 100, మలేషియా రింగిట్‌ 10 లభించాయి. అలాగే 71 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారు వస్తువులు, 230 గ్రాముల వెండి వస్తువులను భక్తులు కానుకలుగా సమర్పించారు. అన్నప్రసాద హుండీ ద్వారా వచ్చిన రూ.3,00,487తో కలిపి మొత్తం రూ.56,68,963 ఆదాయం దేవస్థానానికి సమకూరింది. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ తిరుమూరు అశోక్‌రెడ్డి, కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

అనధికార

మద్యం విక్రేత అరెస్ట్‌

నెల్లూరు(క్రైమ్‌): నగరంలో అనధికార మద్యం విక్రయాలపై ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ నెల్లూరు–1 అధికారులు శనివారం దాడులు చేశారు. ఆత్మకూరు బస్టాండ్‌ ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వెంకటేష్‌ను అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి ఎనిమిది క్వార్టర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్‌ ఎస్సై డి.శ్రీధర్‌ తెలిపారు.

పొదలకూరు నిమ్మధరలు(కిలో)

పెద్దవి : రూ.70

సన్నవి : రూ.40

పండ్లు : రూ.15

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement