అప్పులే తప్ప ఆస్తుల కల్పన శూన్యం | Revenue deficit increases by 180 percent | Sakshi
Sakshi News home page

అప్పులే తప్ప ఆస్తుల కల్పన శూన్యం

Nov 8 2026 3:46 AM | Updated on Nov 8 2026 3:46 AM

Revenue deficit increases by 180 percent

రెవెన్యూ లోటు ఏకంగా 180 శాతం పెరుగుదల  

ఏడాదిలో చేస్తామన్న అప్పులో 77 శాతాన్ని ఆరునెలల్లోనే చేశారు 

ద్రవ్యలోటు భారీగా పెరుగుదల 

కేంద్రం నుంచి గ్రాంట్లు రాబట్టడంలో చంద్రబాబు సర్కారు విఫలం  

2026–27 బడ్జెట్‌ తొలి ఆరునెలల సూచీలను వెల్లడించిన కాగ్‌

సాక్షి, అమరావతి: రాష్ట్ర సంపదను, ప్రజల ఆదాయాన్ని పెంచడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు భారీగా అప్పుల చేయడంలో మాత్రం ముందు వరుసలో ఉంటున్నారు. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వెచ్చించకుండా.. ఎటువంటి ప్రతిఫలం లేని రెవెన్యూ వ్యయాలకు మళ్లించేయడంతో రాష్ట్ర ప్రజలపై మోయలేని అప్పుల భారం పడుతోంది. ఈ విషయాన్ని 2026–27 బడ్జెట్‌ తొలి ఆరునెలల (ఏప్రిల్‌–సెప్టెంబర్  ) కీలక సూచీల్లో కాగ్‌ వెల్లడించింది. ఎవరైనా ఇంటి నిర్మాణానికో లేదా వాహనం కొనుగోలుకో అప్పు చేస్తారు. తద్వారా ఆస్తిగా ఇళ్లు, వాహనం కనిపిస్తాయి. 

అయితే చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వెచ్చించడం లేదని కాగ్‌ నివేదిక స్పష్టం చేసింది. ప్రభుత్వాలు అప్పులు చేస్తే వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తేనో, రహదారులు నిర్మిస్తేనో అవి ఆస్తిగా కనిపిస్తాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులను మెడికల్‌ కాలేజీలకు, రహదారుల నిర్మాణాలకు వెచ్చించకుండా ఎటువంటి ఆస్తులు సమకూరని రెవెన్యూ రంగాలకు ఖర్చు చేస్తోంది. కాగ్‌ వెల్లడించిన మేరకు..  

» ఈ ఏడాది బడ్జెట్‌లో చేస్తామని అంచనా వేసిన మొత్తం అప్పులో 77 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆరునెలల్లోనే చేసేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ నాటికి రూ.58,421 కోట్ల అప్పు చేసింది. అప్పు చేసిన ఈ సొమ్ములో ఆ­స్తుల కల్పనకు కేవలం రూ.16,447 కోట్లు మా­త్ర­మే వినియోగించింది. బడ్జెట్‌లో ఆస్తుల కల్ప­న కోసం వ్యయం చేస్తామని అంచనా వేసిన దాని­లో కేవలం 33.77 శాతమే వ్యయం చేసింది.  
» రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రెవెన్యూ లోటు రూ.22,002 కోట్లు ఉంటుందని అంచనా వేయగా ఆరు నెలల్లో రెవెన్యూ లోటు ఏకంగా రూ.39,780 కోట్లకు చేరింది. ఇది అంచనాలను మించి 180 శాతం పెరిగింది. రెవెన్యూ లోటు నెలనెలా పెరిగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం రెవెన్యూ రాబడులను పెంచకపోవడమే.  
»   కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా.. సీఎం చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి గ్రాంట్లు రూపంలో నిధులు రాబట్టడంతో ఘో­రంగా విఫలమైంది. ఏప్రిల్‌–సెపె్టంబర్‌ మధ్య కేంద్ర గ్రాంట్ల రూపంలో కేవలం రూ.5,233 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇది బడ్టెట్‌ అంచనాల్లో 16.09 శాతమే. కేంద్రం నుంచి గ్రాంట్లు రూపంలో నిధులు ఏటేటా పెరౄ­గాల్సి ఉండగా తగ్గిపోవడం అంటే చంద్రబాబు ప్రభుత్వ అధ్వానస్థితిని తెలియజేస్తోంది.  
»  2023–24లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఏప్రిల్‌ నుంచి సెపె్టంబర్‌ నాటికి కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఏకంగా రూ.21,270 కోట్లు వచ్చాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement