అల్లూరి జిల్లా పరిషత్‌ పీఠంపై వైఎస్సార్‌సీపీ జెండా! | YSRCP wins 1606 MPTC seats across the state | Sakshi
Sakshi News home page

అల్లూరి జిల్లా పరిషత్‌ పీఠంపై వైఎస్సార్‌సీపీ జెండా!

Nov 8 2026 3:18 AM | Updated on Nov 8 2026 3:18 AM

YSRCP wins 1606 MPTC seats across the state

జిల్లాలో మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాల్లో ఆరింటిలో విజయఢంకా

సాక్షి, అమరావతి/సాక్షి, పాడేరు: అధికార టీడీపీ గూండాలు ఎన్ని కుట్రలు, అరాచకాలకు పాల్పడినా అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌ పీఠాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. జిల్లాలో మొత్తం 11 జెడ్పీటీసీ స్థానాలకు శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టగా, రాత్రి 11 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం ఆరు చోట్ల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. గూడెంకొత్తవీధి, చింతపల్లి, పాడేరు, పెదబయలు, డుంబ్రిగుడ, అనంతగిరి జెడ్పీటీసీ స్థానాలు వీటిలో ఉన్నాయి.

ప్రభావితం చేయలేకపోయిన ప్రలోభాలు
కూటమి ప్రలోభాలు, కోట్లాది రూపాయల కుమ్మరింపులు.. వంటివేవీ గిరిజన ఓటర్ల తీర్పును ప్రభావితం చేయలేకపోయాయి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై వారు తమకున్న అభిమానాన్ని ఎప్పుడూ చాటుతూనే వచ్చారు. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి జరిగిన పలు ఎన్నికల్లో జిల్లా ఓటర్లు  వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తున్నారు.  2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో అరకు ఎంపీ, అరకులోయ, పాడేరు ఎమ్మెల్యే స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులనే గెలిపించారు. అలాగే 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అనంతగిరి జెడ్పీటీసీ, జి.మాడుగుల ఎంపీపీ పదవులు మినహా మిగిలిన పది మండలాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే విజయం సాధించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1,606 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు
ఎంపీటీసీ స్థానాల్లో మొత్తం 1,606 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంది. 89 ఎంపీటీసీలను ఏకగ్రీవంగా తన ఖాతాలో వేసుకుంది. జెడ్పీటీసీ స్థానాల్లో ఏకగ్రీవమైన ఒక స్థానంతో పాటు 56 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. శనివారం రాత్రి 12 గంటలకు 4 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement