‘చంద్రగిరిపై టీడీపీ దండయాత్ర.. విజయం వైఎస్సార్‌సీపీదే’ | Chevireddy Bhaskar Reddy Comments On ZPTC Win | Sakshi
Sakshi News home page

‘చంద్రగిరిపై టీడీపీ దండయాత్ర.. విజయం వైఎస్సార్‌సీపీదే’

Nov 8 2026 9:14 AM | Updated on Nov 8 2026 9:14 AM

Chevireddy Bhaskar Reddy Comments On ZPTC Win

సాక్షి, తిరుపతి: తిరుపతి రూరల్ జడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి టీడీపీ కుట్రలు చేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి. రాష్ట్రంలో ప్రజలంతా వైఎస్సార్‌సీపీ పక్షాన ఉన్నారు. నీతిగా నిజాయితీ గా ఎన్నికలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫలితాలు వస్తాయని చెప్పుకొచ్చారు. ఇది జగనన్న విజయం అంటూ వ్యాఖ్యలు చేశారు.

తిరుపతి రూరల్ జడ్పీటీసీ స్థానంలో విజయం అనంతరం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..‘చంద్రగిరి నియోజకవర్గంపై తిరుపతి టీడీపీ నాయకులతో దండయాత్ర చేశారు. తిరుపతి రూరల్ జడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్‌సీపీని ఓడించడానికి కుట్రలు చేశారు. తిరుపతి రూరల్ మండలంలో లక్ష 60 వేల మంది ఓటర్లు ఉన్న జడ్పీటీసీ స్థానంలో గెలవడం సాధారణ విషయం కాదు. టీడీపీ గెలిచిన మూడు జడ్పీటీసీ స్థానాలు రిగ్గింగ్ చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా మరోసారి ఎగురవేశాం. జగనన్న మాకు ఇచ్చిన స్ఫూర్తితో మూడు జడ్పీటీసీ స్థానాలు, ఎంపీటీసీ స్థానాలు గెలిచాం. టీడీపీ రిగ్గింగ్ చేసిన మూడు జడ్పీటీసీ స్థానాలు కూడా హైకోర్టు ఆదేశాలతో మళ్ళీ రీపోలింగ్ జరుగుతుంది. 13 రౌండ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగింది.

నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు, స్క్రూటినీలో తొలగించారు, ఎన్ని అడ్డంకులు సృష్టించినా, దాడులు చేసినా చివరికి పోటీ చేశాం. ఘన విజయం సాధించాము. ప్రజలు వైఎస్సార్‌సీపీ పక్షాన ఉన్నారు. నీతిగా నిజాయితీగా ఎన్నికలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫలితాలు వస్తాయి. గెలిచిన తర్వాత డిక్లరేషన్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ వచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అభినందిస్తున్నా’ అని వ్యాఖ్యలు చేశారు.

సమస్యలు పరిష్కరిస్తా: హర్షిత్‌ రెడ్డి
చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ..‘ఇది ప్రజా విజయం, ఇంత పెద్ద మండలానికి జడ్పీటీసీగా గెలిపించారు. ఇది జగనన్న విజయం. చంద్రగిరి నియోజకవర్గంలో మూడు జడ్పీటీసీ స్థానాలు, ఎంపీటీసీ గెలిచాం. ఇదే మండలంలో 25 ఏళ్ళ క్రితం నాన్న 27 ఏళ్ల వయసులో జడ్పీటీసీగా గెలిచారు. ఈరోజు నేను 25 ఏళ్ల వయసులో ఇదే స్థానం నుంచి జడ్పీటీసీగా విజయం సాధించాను. నాకు ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజా సమస్యలు పరిష్కరిస్తాను’ అని అన్నారు.  

రికార్డు విజయం..
చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ..‘చంద్రగిరి నియోజకవర్గంలో మూడు జడ్పీటీసీ స్థానాలు, ఎంపీటీసీ స్థానాలు గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. జగనన్న ఆశీర్వాదం, మా నాన్న పోరాట స్పూర్తితో ఈరోజు విజయం సాధించాం. తిరుపతి రూరల్ మండలం, చిన గొట్టిగల్లు మండలం, ఎర్రవారి పాల్యం మండలాల్లో వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీ జడ్పీటీసీ స్థానాలు గెలిచాం, అత్యధికంగా ఎంపీటీసీ స్థానాలు గెలిచాం. వైఎస్సార్‌సీపీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ. కూటమి నేతలు కుట్రలు చేసి గెలవాలని చూశారు, ప్రజలు ఆశీస్సులు మాకు ఉన్నాయి. గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ తెలిపారు. 

ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ ఘన విజయం.. తిరుపతిలో చెవిరెడ్డి విక్టరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement