కృష్ణాజిల్లా: ప్రస్తుతం అప్రజాస్వామికంలో ఉన్న ప్రజలు.. మళ్లీ ప్రజాస్వామ్యం వర్థిల్లే రోజులు దగ్గర్లోనే చూస్తారని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. అరచేతిని అడ్డుపెట్టి ఎక్కువ కాలం సూర్యకాంతిని ఆపలేరనేది జగమెరిగిన సత్యమన్నారు వంశీ. 2024 ఎన్నికల్లో ప్రజలను మభ్యెట్టి కూటమి అధికారంలోకి వచ్చిందని, మోసపూరిత వాగ్ధానాలతో ప్రజలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు.
ఈరోజు(గురువారం, నవంబర్ 5వ తేదీ) గన్నవరం జడ్పీ హైస్కూల్లో పరిషత్ ఎన్నికల ఓటు హక్కు వినియోగించుకున్న వల్లభనేని వంశీ ‘సాక్షి’తో మాట్లాడారు. ‘ప్రభుత్వం పై ప్రజలు కోపంగా ఉన్నారు చంద్రబాబుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు తేడాగా వస్తాయనే భయం పట్టుకుంది. అందుకే నామినేషన్లు వేయనివ్వలేదు. నామినేషన్లు వేసినవాటిని రిజెక్ట్ చేశారు. డిస్ క్వాలిఫై చేశారు. బూత్ ఏజెంట్లను బయటికి పంపించి .. రిగ్గింగ్ చేసుకున్నారు. ఈ ఎన్నికలు ఎలా జరిగియో చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు.
సర్వసంఘ పరిత్యాగిని.. నేను పొద్దున్నే రెండు ఇడ్లీలు తింటాను అంటాడు. చేసింది మాత్రం ఏమీ లేదు. ప్రజలెవరూ తమకు ఇవి చేయండని చంద్రబాబు, పవన్ ఇంటి కెళ్లి అడగలేదు .ప్రజల వద్దకు చంద్రబాబే వెళ్లి మరీ హామీలు ఇచ్చారు. సంపద సృష్టిస్తా...మా దగ్గర ఒక విద్య ఉంది.. మనసు ఉంటే మార్గం ఉంటుంది... సంపద సృష్టించి అందరికీ పంచుతాం అన్నారు.
ముప్ఫై నెలల పాలనలో ప్రజల కిచ్చిన వాగ్ధావీలేవీ నెరవేర్చ లేదు. చంద్రబాబు రాజకీయ జీవితం చివరి దశలో ఉంది. ఎవరికైనా అధికారం శాశ్వతం కాదు. ఎవరైనా ఐదు సంవత్సరాలు టెంపరరీ కస్టోడియన్ మాత్రమే. రాజులు లేరు ...రాచరికాలు లేవు ..శాశ్వత వ్యవస్థ అనేదే లేదు. ప్రజలు తెలివైన వారు. .ఏ టైమ్ కి ఎలా రియాక్ట్ అవ్వాలో వాళ్లకు తెలుసు. సరైన సమయంలో సరైన నిర్ణయం ప్రజలు కచ్చితంగా తీసుకుంటారు’అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: షాపులో నక్కిన దొంగ ఓటర్లు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న చెవిరెడ్డి


