పులివెందులలో బూత్‌లను ఆక్రమించిన టీడీపీ మూకలు | TDP mobs occupy booths in Pulivendula | Sakshi
Sakshi News home page

పులివెందులలో బూత్‌లను ఆక్రమించిన టీడీపీ మూకలు

Nov 5 2026 1:36 PM | Updated on Nov 5 2026 1:39 PM

TDP mobs occupy booths in Pulivendula

వైఎస్సార్ జిల్లా: పులివెందులలో మొత్తం పోలింగ్ బూత్ లను టీడీపీ మూకలు ఆక్రమించాయి. నేడు (గురువారం) పులివెందుల, వేముల, వేంపల్లి, లింగాల జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి టీడీపీ గూండాలు అరాచకం సృష్టించాయి. బీటెక్ రవి, అతని బంధువులు, టీడీపీ మూకలు కలిసి అరాచకానికి పాల్పడ్డారు.

ప్రతి బూత్ నుంచీ వైఎస్సార్సీపీ ఏజెంటును  టీడీపీ మూకలు బయటకు తరిమికొట్టాయి. ఇదంతా పూర్తిగా పోలీసుల సహకారంతో జరిగింది. వారు ఏజెంట్లను కూడా అడ్డుకున్నారు. ఓటర్లు రాకుండా పోలింగ్ కేంద్రాలకు టీడీపీ గూండాలు తాళం వేశాయి. పెట్రోల్ బాంబులతో టీడీపీ మూకలు స్వైర విహారం చేశాయి. కాగా ఉదయం 11 గంటలకే   దాదాపు 50 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 5 గంటలకే బూత్‌లల్లోకి దూరి టీడీనీ మూకలు రిగ్గింగ్‌కు పాల్పడ్డాయి. టీడీపీ దాడుల్లో విలేకరులు, ఓటర్లకు గాయాలయ్యాయి. పోలీసులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు కలిసి పులివెందులలో అరాచక పర్వం కొనసాగిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement