సాక్షి, చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ వేళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాయినగర్ పంచాయతీతో పాటు మంగళం, ఓటేరు ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద దొంగ ఓట్లు, రిగ్గింగ్ జరుగుతున్నాయంటూ వైఎస్సార్‌సీపీ పేర్కొంది. ఈ క్రమంలో కొందరు దొంగ ఓటర్లను వైఎస్సార్‌సీపీ నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్టుకున్నారు. దీంతో, టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, స్థానికులు మండిపడ్డారు.
సాయినగర్ వద్ద భారీగా వ్యక్తుల మోహరింపు
చంద్రగిరి సాయినగర్ పంచాయతీ పరిధిలోని పోలింగ్ కేంద్రాల సమీపంలో పెద్ద సంఖ్యలో బయటి వ్యక్తులు మోహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దొంగ ఓట్లు వేసేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు వారిని రప్పించాయని వైఎస్సార్‌సీపీ నాయకులకు తెలిసింది. పోలింగ్ కేంద్రాల సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులపై స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది.
దొంగ ఓటర్లను తరిమికొట్టిన చెవిరెడ్డి..
ఈ క్రమంలో సాయినగర్ పంచాయతీ వద్దకు చేరుకున్న వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఓ గదిలో ఉన్న దొంగ ఓటర్లను పట్టుకున్నారు. దీంతో, వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయని వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపించారు.
తిరుపతి సాయినగర్ లో దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి- బూత్ దగ్గరకు దొంగ ఓటర్లను తరలించిన టీడీపీ.. - దొంగ ఓటర్లను గుర్తించి పోలీసులకు పట్టించిన చెవిరెడ్డి - సాయినగర్ లో ఓ షాపులో నక్కిన దొంగ ఓటర్లు - దొంగ ఓటర్లను పట్టుకోవడంతో టీడీపీ నేతల రభస - చెవిరెడ్డితో వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) November 5, 2026
మంగళం, ఓటేరు బూత్‌ల వద్ద రిగ్గింగ్ ఆరోపణలు
మరోవైపు మంగళం, ఓటేరు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడుతున్నాయని, ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరులు పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.
Chevireddy MASS!😂🔥 తిరపతి లో TDP దొంగ ఓటర్లను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న చెవిరెడ్డి! https://t.co/ZtSAKqmCEW
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) November 5, 2026
ఇదీ చదవండి: టీడీపీ ఎమ్మెల్యే సతీమణి హల్‌చల్.. సుధా రెడ్డి ఇదేం తీరు?


