మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Press Meet | Sakshi
Sakshi News home page

మొత్తం ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారు: వైఎస్‌ జగన్‌

Nov 5 2026 3:49 PM | Updated on Nov 5 2026 4:12 PM

YS Jagan Mohan Reddy Press Meet

సాక్షి,తాడేప‌ల్లి:  స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అరాచకాలపై వైఎస్సార్‌సీపీ అధినేత‌, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మొత్తం ఎన్నిక‌ల్ని హైజాక్ చేసిన చరిత్ర కూటమి ప్రభుత్వానిదంటూ మండిపడ్డారు. దేశంలో ఇలాంటి ఎన్నికలు ఎక్కడా జరగలేదని, వీటిని ఎన్నికలంటారా? అని ప్రశ్నించారు.  మొత్తం  ఎన్నికల ప్రక్రియనే కబ్జా చేశారని, పోలీసులే ఎదుటే రిగ్గింగ్‌ చేశారనేది వాస్తవం కాదా? అని నిలదీశారు.

ఈ రోజు(గురువారం, నవంబర్‌ 5వ తేదీ) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్‌మీట్‌లో చంద్రబాబు సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని తూర్పారబట్టారు. 

‘ఇవి ఎలక్షన్‌లా? లేక సెలక్షన్‌లా? అన్ని రకాలుగా ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేశారు. దేశ చరిత్రతో ఇలాంటి ఎన్నికలు ఎక్కడా జరగలేదు. ఎన్నికల ప్రక్రియను మొత్తం కబ్జా చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ రాగానే బైండోవర్‌ కేసుల పేరుతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టారు. మా నేతల్ని నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారు.

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగడం లేదు. అధికార దుర్వినియోగంతో, రౌడీయిజంతో ప్రజాస్వామ్యాన్ని అన్నీ రకాలుగా కూనీ చేశారు. పారదర్శకంగా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదు.  ప్రజా స్వామ్యాన్ని కూనీ చేసి చంద్రబాబు మరింత దయనీయ స్థితికి దిగజారారు’ అని ధ్వజమెత్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement