కబడ్డీ క్రీడాకారిణిలపై వేటు

Suspension On Women Kabaddi Players Srikakulam - Sakshi

జిల్లాలోని క్రీడావర్గాల్లో సంచలనంగా మారిన వైనం

సంఘ ఉనికికే విఘాతం కలిగేలా ప్రవర్తించడంతో తప్పలేదు: చిరంజీవి

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాలోని ముగ్గురు కబడ్డీ క్రీడాకారిణులపై క్రమశిక్షణా రాహిత్యం కింద అసోసియేషన్‌ ఏడాది కాలం సస్పెన్షన్‌ వేటు వేసింది. అలాగే మేనేజర్‌గా వ్యవహరించిన వ్యక్తికి కూడా ఇదే శిక్ష విధించింది. ప్రస్తుతం జిల్లా క్రీడావర్గాల్లో ఇదే విషయం హాట్‌టాపిక్‌గా మారింది. సంఘం ప్రతినిధులు, కోచ్‌లు తెలిపి న వివరాల ప్రకారం.. గత కొద్దికాలంగా ముద్దా డ గౌరి(శ్రీకూర్మం), జుత్తు భవానీ(దేశమంతుపు రం, జమ్ము), కరగాన సంధ్య (శ్రీకూర్మం, గొల్లవీధి) జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ విధి విధానాల కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. శిక్షణ సమయంలో కోచ్‌లను అగౌరవపరుస్తూ లేనిపోని దు్రçష్పచారం చేస్తున్నారు. అలాగే ఈనెల 18 నుంచి 20 వరకు విజయనగరం వేదికగా జరిగిన 66వ ఏపీ రాష్ట్ర సీనియర్స్‌(పురుషులు, మహిళ ల) కబడ్డీ చాంపియన్‌షిప్‌ పోటీల్లో అవమానకర రీతిలో ప్రవర్తించారు. అన్ని జిల్లాల క్రీడాకారులు, సంఘాల బాధ్యుల సమక్షంలో శ్రీకాకుళం జిల్లా పరువు ప్రతిష్టలను మంటగలిపే విధంగా వ్యవహారించడంతో సస్పెన్షన్‌కు గురయ్యారు.

పరిస్థితి చేయి దాటిపోవడంతో!
పరిస్థితి చేయి దాటిపోవడంతో తీవ్రంగా పరిగణించిన జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ పెద్దలు క్రీడాకారిణులపై వేటుకు రంగం సిద్ధమయ్యారు. అలాగే ఇదే పోటీలకు మేనేజర్‌గా వ్యవహరించి న సీనియర్‌ క్రీడాకారిణి పి.ఝాన్సీ(చిన్నాపురం)ని సైతం ఏడాది పాటు సస్పెండ్‌ చేశారు. ఇదే విషయమై శ్రీకాకుళం ఆర్ట్స్‌ కళాశాల మైదా నంలోని డీఎస్‌ఏ కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ సమావేశంలో వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సస్పెన్షన్‌ విషయాన్ని కబడ్డీ సంఘం నాయకులు ధ్రువీకరించారు. ఈ సస్పెన్షన్‌ ఏడాదిపాటు ఉంటుందని కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేని చిరంజీవిరావు స్పష్టం చేశారు.

దీనికి సంబంధించిన కాపీలను డీఎస్‌ఏ జిల్లా కార్యాలయం, జిల్లా ఒలింపిక్‌ సంఘం, రాష్ట్ర కబడ్డీ సంఘం, సంఘం జిల్లా అధ్యక్షుడు గౌతు శ్యామ్‌సుందర్‌శివాజీ, స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యాలయం, జిల్లా పీఈటీ సంఘానికి చేరవేసినట్లు ఆయన తెలిపారు. వీరంతా ఎటువంటి అధికారిక కబడ్డీ పోటీలు, ఎంపికల్లో పాల్గొనేం దుకు వీలులేదని పేర్కొన్నారు. భవిష్యతులో క్రీడాకారుల్లో మార్పు కనిపించినట్లయితే సం ఘం కార్యవర్గ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోవైపు క్రీడాకారిణుల సస్పెన్షన్‌ విధానాన్ని పలువురు పీఈటీలు వ్యతి రేకించినా.. కబడ్డీ సంఘం ఉనికికే విఘాతం కలిగేలా వ్యవహరించడం ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని మెజారిటీ సభ్యులు పట్టుబట్టినట్లు సమాచారం. సమావేశంలో డీఎస్‌ఏ కోచ్‌ ఎస్‌. సింహాచలం, సాధు శ్రీనివాసరావు, ఎం.నీలా ద్రి, టి.ఈశ్వర్రావు, రవి, రమేష్, లోకేశ్వర్రావు, నారాయణ, వివిధ జోన్‌ల ప్రతినిధులు, పీఈటీలు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top