అండర్–17 కబడ్డీ జట్ల ఎంపిక
కబడ్డీ అండర్–17 బాలుర, బాలికల జిల్లా జట్ల వివరాలను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి ఎం గణేష్ సోమవారం ప్రకటించారు.
చిరుమామిళ్ళ (నాదెండ్ల): కబడ్డీ అండర్–17 బాలుర, బాలికల జిల్లా జట్ల వివరాలను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యదర్శి ఎం గణేష్ సోమవారం ప్రకటించారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ళలోని నడికట్టు రామిరెడ్డి జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన ఎంపిక పోటీలకు 40 స్కూళ్ల నుంచి సుమారు 500 మంది క్రీడాకారులు, ముఖ్యఅతిథిగా నడికట్టు రామిరెడ్డి హాజరయ్యారు.
బాలుర జట్టులో..
వై.నజీర్‌మీరసా, ఎన్.పవన్‌కుమార్ (చిలకలూరిపేట), సాయికుమార్ (గుళ్ళాపల్లి), ఇ.హరిబాబు(మాదల), జి.వెంకట శివనాగేశ్వరరావు (కుంకలగుంట), జి.సతీష్ (పిల్లుట్ల), జి.సైదులు మస్తాన్ (వి రెడ్డిపాలెం), ఎం.సుబ్బారావు (వెల్లటూరు), ఎస్.శ్రీనివాసరెడ్డి (కావూరు), భానుప్రసాద్ (చందోలు), ఎం.మేరిబాబు (తుమృకోట), బి.మణికంఠ (ఇంకొల్లు), స్టాండ్‌బైగా శ్రీనివాసరెడ్డి(చిరుమామిళ్ళ), పి.కరీం (చిలకలూరిపేట) ఎంపికయ్యారు.
బాలికల జట్టులో..
డి.కవిత, ఎ.మహిత, సీహెచ్ ధనశ్రీ, ఎం.నిరోష, పి.వరలక్ష్మి, యు.భార్గవి (కావూరు), వి.సంధ్యారాణి (కుంకలగుంట), ఎ.అనిత (చిలకలూరిపేట), ఎ.రాజకుమారి (వల్లిపాలెం), ఎస్yì .ముబీనా (పెదకొండపాడు), ఐ.లావణ్య (రాజోలు), బి.దివ్య (ధూళిపూడి) ఎంపికయ్యారు.