హైదరాబాద్‌ జట్ల జోరు | hyderabad beats adilabad in inter district kabaddi | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ జట్ల జోరు

Dec 9 2017 10:41 AM | Updated on Dec 9 2017 10:41 AM

hyderabad beats adilabad in inter district kabaddi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్‌ జిల్లా సీనియర్‌ కబడ్డీ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్లు శుభారంభం చేశాయి. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి జోరు కనబరిచాయి. మహిళల విభాగంలో హైదరాబాద్‌ 53–33తో ఆదిలాబాద్‌పై ఘనవిజయం సాధించింది. పురుషుల విభాగంలోని తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 69–48తో నిజామాబాద్‌పై, రెండో మ్యాచ్‌లో 37–20తో మెదక్‌పై గెలుపొందింది.

ఇతర పురుషుల మ్యాచ్‌ల్లో మెదక్‌ 51–44తో మహబూబ్‌నగర్‌పై, వరంగల్‌ 60–20తో ఆదిలాబాద్‌పై, ఖమ్మం 37–19తో కరీంనగర్‌పై, నల్లగొండ 56–28తో మెదక్‌పై, రంగారెడ్డి 46–31తో వరంగల్‌పై, మహబూబ్‌నగర్‌ 54–27తో నిజామాబాద్‌పై, కరీంనగర్‌ 61–17తో ఆదిలాబాద్‌పై నెగ్గాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement