కబడ్డీ ఆడుతూ.. | student dies while playing kabaddi | Sakshi
Sakshi News home page

కబడ్డీ ఆడుతూ..

Aug 31 2017 11:31 AM | Updated on Sep 12 2017 1:29 AM

ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

రఘునాథపాలెం: ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కబడ్డీ ఆడుతూ యువకుడు మృతిచెందిన సంఘటన జిల్లాలోని రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో బుధవారం అర్ధరాత్రి దాటాక వెలుగుచూసింది. గ్రామంలో వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలో పాల్గొన్న మల్లికార్జున్‌(24) అనే యువకుడు కోర్టులోనే కుప్పకూలి మృతి చెందాడు. ఇటీవలే ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన మల్లికార్జున్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement