ఏషియన్‌ గేమ్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్ది ఖరారు | Asian Games 2026 Men's Cricket: team India to take on Afghanistan in quarter final | Sakshi
Sakshi News home page

ఏషియన్‌ గేమ్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో టీమిండియా ప్రత్యర్ది ఖరారు

Sep 26 2026 10:29 AM | Updated on Sep 26 2026 10:45 AM

Asian Games 2026 Men's Cricket: team India to take on Afghanistan in quarter final

source: BCCI X

ఏషియన్‌ గేమ్స్‌ 2026 పురుషుల క్రికెట్‌లో భారత్‌ క్వార్టర్‌ఫైనల్‌ ప్రత్యర్థి ఖరారైంది. శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వంలోని భారత జట్టు సోమవారం జరిగే రెండో క్వార్టర్‌ ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. భారత్‌కు సీడింగ్‌, ఐసీసీ ర్యాంకింగ్‌ ఆధారంగా నేరుగా క్వార్టర్‌ఫైనల్‌ బెర్త్‌ లభించిన విషయం తెలిసిందే.

ఆఫ్ఘనిస్తాన్‌ ఎలా క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది..?
జపాన్‌, నేపాల్‌ మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో ఆఫ్ఘనిస్తాన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. గ్రూప్‌-ఏలో ఆఫ్ఘనిస్తాన్‌, జపాన్‌, నేపాల్‌ జట్లు పోటీపడగా.. నేపాల్‌, ఆఫ్ఘనిస్తాన్‌ తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లు దక్కించుకున్నాయి. 

గ్రూప్‌-ఏ టాపర్‌గా నిలిచిన నేపాల్‌ సెప్టెంబర్‌ 29న జరిగే మూడో క్వార్టర్‌ ఫైనల్లో శ్రీలంకను ఢీకొంటుంది. నేపాల్‌ తాజాగా జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌లో తమకంటే మెరుగైన ఆఫ్ఘనిస్తాన్‌కు షాకిచ్చింది.

మరో రెండు బెర్త్‌లు ఎవరివి..?
గ్రూప్‌-ఏ నుంచి నేపాల్‌, ఆఫ్ఘనిస్తాన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. గ్రూప్‌-బి బెర్త్‌లు ఖరారు కావాల్సి ఉంది. ఈ గ్రూప్‌లో మలేషియా, హాంగ్‌కాంగ్‌ చైనా, ఒమన్‌ జట్లు పోటీపడుతున్నాయి. ఈ గ్రూప్‌ నుంచి తొలి స్థానంలో నిలిచే జట్టు సెప్టెంబర్‌ 29న జరిగే నాలుగో క్వార్టర్‌ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. 

రెండో స్థానంలో నిలిచే జట్టు సెప్టెంబర్‌ 28న జరిగే తొలి క్వార్టర్‌ ఫైనల్లో పాకిస్తాన్‌ను ఢీకొంటుంది. ప్రస్తుతం మలేషియా, హాంగ్‌కాంగ్‌ తలో 2 పాయింట్లతో మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. ఒమన్‌ ఖాతా తెరవకుండా చివరి స్థానంలో ఉంది.

ఇదిలా ఉంటే, ఈ క్రీడల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ ఫుల్‌ మెంబర్స్‌ జట్టుతో బరిలోకి దిగింది. శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని భారత జట్టులో అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, శివమ్‌ దూబే, తిలక్‌ వర్మ, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్‌ తదితర స్టార్లు ఉన్నారు.

ఇదీ చదవండి: తొలి వన్డేకు ముందు టీమిండియాకు భారీ షాక్‌


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement