కాసాబ్లాంకా: అరబ్ దేశం మొరాకో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఫాతిమా జహ్రా మన్సూరీ నియమితులయ్యారు. మొరాకో రాజు మహ్మద్–6 మంగళవారం ఈ మేరకు ఈమె పేరును ప్రకటించారు. వృత్తిరీత్యా లాయర్ అయిన ఫాతిమా ప్రస్తుతం పట్టణ ప్రణాళిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. 2009–2015 సంవత్సరాల్లో మరకేశ్ నగర మేయర్‌గా కూడా ఈమె బాధ్యతలు నిర్వర్తించారు.
త్వరలోనే ఫాతిమా నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని రాయల్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. మొరాకో ఎన్నికల విధానంలో దేశంలోని ఏ ఒక్క పార్టీ కూడా పూర్తి స్థాయి మెజారిటీ సాధించడం కష్టం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈమె సారథ్యంలోని అథెంటిసిటీ అండ్ మోడరి్నటీ పార్టీ ఎక్కువ సీట్లు సాధించింది. ఫాతిమా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. అరబ్ దేశాల్లో మొదటిసారిగా ట్యునిíÙయాకు మహిళా ప్రధానిగా నజ్లా బౌడెన్ 2021–23 సంవత్సరాల్లో పనిచేశారు.


