భారీగా పతనమైన ఇరాన్ కరెన్సీ
ఇరాన్: అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇరాన్ కరెన్సీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోంటోంది. విలువ నానాటికీ పడిపోతోంది. మంగళవారం ఇరాన్ కరెన్సీ విలువ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. టెహ్రాన్‌లోని వ్యాపారులు ఒక అమెరికన్ డాలర్‌కు 25 లక్షలకు పైగా రియాల్స్‌ను మారకం చేసుకున్నారు.
సెప్టెంబర్ 2న ఒక డాలర్‌కు 22 లక్షల రియాల్స్ వచ్చాయి. కేవలం 27 రోజుల వ్యవధిలోనే మరోసారి భారీగా పతనం కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో పశి్చమాసియాలో యుద్ధం మొదలైంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు దిగాయి. ఇరాన్ సైతం ప్రతిదాడులు సాగిస్తోంది. యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ కరెన్సీ పదేపదే కొత్త కనిష్ట స్థాయిలకు చేరుకుంటోంది.


