ఈనెల 19 నుంచి భోపాల్‌లో మహిళల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ
న్యూఢిల్లీ: ఆరు దేశాలు పాల్గొనే మహిళల హాకీ ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది. భోపాల్ వేదికగా నవంబర్ 19న జరిగే తొలి మ్యాచ్‌లో మలేసియాతో భారత మహిళలు తలపడతారు. టోర్నీలో ఈ రెండు జట్లతో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్ బరిలోకి దిగుతున్నాయి.
తొలి మ్యాచ్ తర్వాత నవంబర్ 21, 22, 24, 25 తేదీల్లో వరుసగా కొరియా, థాయ్‌లాండ్, చైనా, జపాన్‌లను భారత్ ‘ఢీ’కొంటుంది. గతంలో భారత మహిళల జట్టు మూడుసార్లు (2016, 2023, 2024) ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. టోర్నీలో ప్రతి జట్టు మిగిలిన ఐదుగురు ప్రత్యర్థులను ఎదుర్కొంటుంది. పాయింట్ల ప్రకారం టాప్–4 టీమ్‌లు సెమీస్ చేరతాయి. నవంబర్ 28న ఫైనల్ నిర్వహిస్తారు.


