ఏఐటీఏ కార్యవర్గంలో సానియా మీర్జా, మహేశ్‌ భూపతి | Sania Mirza and Mahesh Bhupathi in AITA executive committee | Sakshi
Sakshi News home page

ఏఐటీఏ కార్యవర్గంలో సానియా మీర్జా, మహేశ్‌ భూపతి

Nov 6 2026 12:43 AM | Updated on Nov 6 2026 12:43 AM

Sania Mirza and Mahesh Bhupathi in AITA executive committee

ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నిక  

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ దిగ్గజాలు సానియా మీర్జా, మహేశ్‌ భూపతి... అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) సభ్యులుగా ఎన్నికయ్యారు. అంతకుముందే వీరిద్దరూ స్పోర్ట్స్‌ పర్సన్స్‌ ఆఫ్‌ అవుట్‌స్టాండింగ్‌ మెరిట్‌ (ఎస్‌ఓఎం) కోటాలో విశిష్ట క్రీడాకారులుగా ఏఐటీఏ కార్యవర్గానికి కూడా ఎంపికయ్యారు. మహేశ్‌ భూపతి అత్యధికంగా 23 ఓట్లు సాధించగా... సానియా మీర్జాకు 18 ఓట్లు దక్కాయి. జానకీ కృష్ణమూర్తికి 13 ఓట్లు, విశాల్‌ ఉప్పల్‌కు 7 ఓట్లు లభించాయి. 

అంతకుముందు జరిగిన జనరల్‌ బాడీ ఎన్నికల్లో మహేశ్‌ భూపతి 19, సానియా మీర్జా 18 ఓట్లు సాధించి ‘విశిష్ట క్రీడాకారుల’ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. వీరితో పాటు ఆశుతోష్‌ సింగ్‌ (17 ఓట్లు), షాలిని ఠాకూర్‌ చౌలా (16 ఓట్లు) కూడా జనరల్‌ బాడీకి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మహేశ్‌ భూపతి మాట్లాడుతూ... ‘ఏఐటీఏ నుంచి గతంలో ఎలాంటి మద్దతు లభించకపోయినా... ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి 31 మంది విశిష్ట క్రీడాకారులు మందుకు రావడం ఎంతో సంతోషాన్నిచ్చింది. భారత టెన్నిస్‌లో సానుకూల మార్పులు తీసుకురావడమే మా లక్ష్యం’ అని అన్నాడు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement