ఇప్పటికి కుదిరింది: అనన్య బిర్లా పోస్ట్‌ వైరల్‌ | IPL 2026 RCB vs CSK: Ananya Birla Shares Pic With Sania Mirza Izzu Best | Sakshi
Sakshi News home page

ఇప్పటికి కుదిరింది: ఓవైపు కావ్యా మారన్‌.. మరోవైపు అనన్య, సానియా మీర్జా

Apr 6 2026 3:17 PM | Updated on Apr 6 2026 3:34 PM

IPL 2026 RCB vs CSK: Ananya Birla Shares Pic With Sania Mirza Izzu Best

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో పాటు ఆ జట్టు యజమాని కావ్యా మారన్‌కు కూడా అభిమాన గణం ఎక్కువే. మ్యాచ్‌ సమయంలో స్టేడియానికి విచ్చేసి జట్టును ఉత్సాహపరచడం ఆమెకు పరిపాటి. ముఖ్యంగా హోం గ్రౌండ్‌ అంటే ఉప్పల్‌లో మ్యాచ్‌లో కావ్య తప్పక ఉండాల్సిందే.

ఇక మ్యాచ్‌ ఆసాంతం తాను ఇచ్చే ఎక్స్‌ప్రెషన్లతో గత కొన్నేళ్లుగా కావ్యా మారన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పుడు ఆమెకు పోటీగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఫ్రాంఛైజీ యాజమాన్యంలో భాగమైన అనన్య బిర్లా వచ్చి చేరింది. ముఖ్యంగా ఐపీఎల్‌-2026 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ- సన్‌రైజర్స్‌ తలపడగా.. వీరిద్దరు హైలైట్‌ అయ్యారు.

తాజాగా ఆదివారం డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌- లక్నో సూపర్‌ జెయింట్స్‌ తలపడగా.. కావ్యా మారన్‌ ఈ మ్యాచ్‌కు హాజరైంది. మరోవైపు.. సాయంత్రం ఆర్సీబీ- చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌కు అనన్య బిర్లా విచ్చేసింది.

అయితే, ఈసారి అనన్య తనతో పాటు తన ప్రాణ స్నేహితురాలు, భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జాను కూడా తీసుకువచ్చింది. ఓవైపు ఆర్సీబీ దిగ్గజం విరాట్‌ కోహ్లి సతీమణి అనుష్క శర్మ.. మరోవైపు.. అనన్య- సానియా స్టాండ్స్‌ నుంచి ఆర్సీబీ ఉత్సాహపరిచారు. ఇక సానియాతో పాటు ఆమె కుమారుడు ఇజహాన్‌ సైతం ఈ మ్యాచ్‌ను వీక్షించాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో అనన్య పెట్టిన పోస్టు నెటిజన్లను ఆకర్షిస్తోంది. సానియా- ఇజహాన్‌ల వెనుక వరుసలో తాను కూర్చుని ఉన్న ఫొటోను పంచుకున్న అనన్య.. ‘‘కలిసి ఫొటో దిగాలని ఎల్లప్పుడూ అనుకుంటాము. కానీ ఎప్పుడూ ఇలా కుదరలేదు. ఈసారి ఈ ఫొటో దొరికింది. ఐ లవ్‌ యూ సానియా.. ఇజ్జూ.. నువ్వు బెస్ట్‌ బాబూ’’ అని క్యూట్‌ క్యాప్షన్‌ ఇచ్చింది.

ఇక మ్యాచ్‌ల విషయానికొస్తే.. లక్నో చేతిలో సన్‌రైజర్స్‌ ఓడిపోగా.. ఆర్సీబీని చెన్నైని చిత్తు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్తానానికి చేరింది. ఈ క్రమంలో కావ్య నిరాశగా వెనుదిరగగా.. అనన్య బృందం సంబరాలు చేసుకుంది.

చదవండి: IPL కాదు!.. PSL నంబర్‌ వన్‌: పీసీబీ చీఫ్‌ ఓవర్‌ కాన్ఫిడెన్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement