Ananya Birla
-
జాన్వీ కపూర్‌కు లంబోర్గిని కారు గిఫ్ట్.. అందుకోసమేనా?
నచ్చినవారికి గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. ఎవరికి తోచిన రీతిలో వారు ఆయా బహుమతులు ఇస్తుంటారు. అయితే ఇక్కడ ఓ అమ్మాయి మాత్రం ఏకంగా కోట్లు విలువ చేసే లగ్జరీ కారును తన స్నేహితురాలికి గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇంతకీ ఆ కారును అందుకుంది ఎవరో కాదు హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సింగర్, ఎంటర్ప్రెన్యూర్ అనన్య బిర్లా (Ananya Birla).. పర్పుల్ కలర్ లంబోర్గినిని జాన్వీకి శుక్రవారం నాడు గిఫ్ట్‌గా ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ వ్యక్తి ఆ లంబోర్గిని కారును జాన్వీ ఇంటికి డ్రైవ్ చేసుకుని వెళ్లి ఇచ్చేశాడు. అంతేకాదు ఆ కారులో ఒక పెద్ద గిఫ్ట్ బాక్స్ కూడా ఉంది. ఇక లంబోర్గిని కారు విలువ దాదాపు రూ.5 కోట్లు.ఎవరీ అనన్య బిర్లా?బిజినెస్ టైకూన్ కుమార్ మంగళం- నీరజ బిర్లాల కూతురే అనన్య. ఈమె సింగర్ మాత్రమే కాదు ఎంటర్ప్రెన్యూర్ కూడా! తాజాగా ఆమె మేకప్ బ్రాండ్‌ను కూడా లాంచ్ చేసింది. దీనికి జాన్వీ ప్రచారకర్తగా ఉండనుందని, అందుకు కృతజ్ఞతగా ఈ బహుమతిని పంపించిందని తెలుస్తోంది.జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురిగా చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ధడక్ చిత్రంతో సినీప్రయాణం ఆరంభించింది. గుంజన్ సక్సేనా, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిస్టర్ అండ్ మిసెస్ మహి వంటి సినిమాలు చేసింది. దేవర: పార్ట్ 1 చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో పెద్ది మూవీలో యాక్ట్ చేస్తోంది. అలాగే ఆమె చేతిలో పరమ సుందరి, సన్నీ సంస్కారీ కి తులసి కుమారి చిత్రాలున్నాయి. View this post on Instagram A post shared by Hashtag Magazine (@hashtagmagazine.in) View this post on Instagram A post shared by Ananya Birla (@ananyabirla)చదవండి: థియేటర్లలో ఆల్కహాల్ అమ్మకాలు.. తూలుతూ సినిమా చూడొచ్చు! -
కాస్మెటిక్స్ విభాగంలోకి అనన్య బిర్లా
ముంబై: వ్యాపార దిగ్గజం కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా (30) తాజాగా సౌందర్య సాధనాలు, కాస్మెటిక్స్ విభాగంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ ఏడాది కొత్త వెంచర్ ద్వారా పలు బ్యూటీ, పర్సనల్ కేర్ బ్రాండ్లను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నారు. అంతర్జాతీయ ఉత్పత్తులు, వ్యక్తిగత సంరక్షణ అంశాలపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ వినియోగదారులు, దేశీ బ్రాండ్ల నుంచి మరింతగా ఆశిస్తున్నట్లు అనన్య ఒక ప్రకటనలో తెలిపారు. వారి ఆకాంక్షలను తీర్చే విధంగా తమ ఉత్పత్తుల శ్రేణి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అయితే, వెంచర్ పేరు, పెట్టుబడి ప్రణాళికలు మొదలైన వివరాలను వెల్లడించలేదు. ప్రస్తుతం ఏటా 10–11 శాతం వృద్ధి చెందుతున్న పర్సనల్ కేర్ మార్కెట్ 2028 నాటికి 34 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. 17 ఏళ్ల వయస్సులోనే అనన్య బిర్లా సూక్ష్మ రుణాల సంస్థ స్వతంత్ర మైక్రోఫిన్ను ప్రారంభించారు. ప్రస్తుతం ఇది దేశీయంగా రెండో అతి పెద్ద ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐగా కార్యకలాపాలు సాగిస్తోంది. గాయని, పాటల రచయిత కూడా అయిన అనన్య.. 62 బిలియన్ డాలర్ల ఆదిత్య బిర్లా గ్రూప్ బోర్డులో డైరెక్టరుగా ఉన్నారు. -
కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టనున్న అనన్య బిర్లా (ఫోటోలు)
-
కొత్త బిజినెస్‌లోకి అనన్య బిర్లా: ఇషా అంబానీకి పోటీ!?
అందానికి ప్రాధాన్యత ఇచ్చేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో.. చాలామంది ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు భారతీయ ధనవంతులలో ఒకరు.. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ 'కుమార్ మంగళం బిర్లా' పెద్ద కుమార్తె 'అనన్య బిర్లా' (Ananya Birla) చేరనున్నారు. ఈమె బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు.ఫిబ్రవరి 5న, అనన్య బిర్లా ఒక బ్యూటీ బ్రాండ్‌ను ప్రారంభించాలనే తన ప్రణాళికలను వెల్లడించింది. ఇది టాటాస్, హిందుస్తాన్ యూనిలీవర్ (HUL), లోరియల్ (L'Oréal) వంటి వాటితో పాటు ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ 'తిరా'కు కూడా పోటీ ఇవ్వనున్నట్లు సమాచారం.భారతదేశంలో అందానికి సంబంధించిన ఉత్పత్తుల వినియోగం పెరుగుతోంది. కాబట్టి ఈ రంగం ఏటా 10-11 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. ఇది 2028 నాటికి 34 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. దీనిని దృష్టిలో ఉంచుకుని మేకప్, సువాసనలతో సహా అన్ని విభాగాలలో వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని.. దశలవారీగా తమ వ్యాపారం ప్రారంభమవుతుందని అనన్య బిర్లా వెల్లడించారు.అనన్య బిర్లా ప్రారంభించనున్న వెంచర్ పేరు, అది ఏ బ్రాండ్స్ అందిస్తుందనే విషయాలు అధికారికంగా వెల్లడికాలేదు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులను భారత మార్కెట్‌కు తీసుకురావడం లక్ష్యంగా ఈ వెంచర్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే ఈమె ప్రారంభించనున్న వ్యాపారానికి బాలీవుడ్ నటి 'జాన్వీ కపూర్' బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం.అనన్య బిర్లాఅనన్య బిర్లా.. ఆదిత్య బిర్లా గ్రూప్ అధినేత, దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన కుమార మంగళం బిర్లా కుమార్తె. సాంప్రదాయ వ్యాపారాలను విడిచిపెట్టి తనకంటూ సొంత మార్గాన్ని ఎంచుకుంది. ఒక్క బిజినెస్‌లోనే కాకుండా వివిధ రంగాల్లో రాణిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సింగర్, రైటర్ కూడా.అనన్య బిర్లా ముంబైలోని అమెరికన్ స్కూల్ ఆఫ్ బాంబేలో ప్రాథమిక విద్య పూర్తి చేసింది. ఆ తరువాత యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉన్నత చదువులు చదివింది. చదువు పూర్తయిన తరువాత ప్రారంభించిన 'స్వతంత్ర మైక్రోఫైనాన్స్' సంస్థ గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అల్పాదాయ వర్గాలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సేవలను అందిస్తోంది. ఈ సంస్థకు ఆమె సీఈవోగా కూడా ఉన్నారు. అలాగే క్యూరోకార్టే అనే లగ్జరీ ఈ-కామర్స్ సంస్థను కూడా ఆమె ప్రారంభించారు. హస్త కళాకృతులు, శిల్పకళా ఉత్పత్తులను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తోంది.ఇదీ చదవండి: రతన్ టాటా ఫ్రెండ్.. శంతనుకు టాటా మోటార్స్‌లో కీలక బాధ్యతలుస్వతంత్ర మైక్రోఫిన్అనన్య బిర్లా తన 17ఏళ్ల వయసులోనే.. మైక్రో లెండింగ్ కంపెనీ 'స్వతంత్ర మైక్రోఫిన్' ప్రారంభించింది. ఈ సంస్థ ఇప్పుడు దేశంలోని రెండో అతిపెద్ద ఎన్బీఎఫ్సీ ఎంఎఫ్ఐగా రికార్డ్ సృష్టించింది. అంతే కాకుండా ఈమె ఏఐ ప్లాట్‌ఫామ్ బీటా వెర్షన్‌ను కూడా ప్రారంభించింది. ఇప్పుడు ముచ్చటగా మూడో వెంచర్ ప్రారభించడానికి సిద్ధమైంది.