జాన్వీ కపూర్‌కు లంబోర్గిని కారు గిఫ్ట్‌.. అందుకోసమేనా? | Janhvi Kapoor Gets Purple Lamborghini Gift From Friend Ananya Birla, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

జాన్వీ కపూర్‌కు రూ.5 కోట్ల విలువ చేసే లంబోర్గిని గిఫ్ట్‌ ఇచ్చిన ఫ్రెండ్‌..

Apr 12 2025 1:01 PM | Updated on Apr 12 2025 1:27 PM

Janhvi Kapoor Gets Purple Lamborghini from Friend Ananya Birla

నచ్చినవారికి గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. ఎవరికి తోచిన రీతిలో వారు ఆయా బహుమతులు ఇస్తుంటారు. అయితే ఇక్కడ ఓ అమ్మాయి మాత్రం ఏకంగా కోట్లు విలువ చేసే లగ్జరీ కారును తన స్నేహితురాలికి గిఫ్ట్‌గా ఇచ్చింది. ఇంతకీ ఆ కారును అందుకుంది ఎవరో కాదు హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor). సింగర్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌ అనన్య బిర్లా (Ananya Birla).. పర్పుల్‌ కలర్‌ లంబోర్గినిని జాన్వీకి శుక్రవారం నాడు గిఫ్ట్‌గా ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఓ వ్యక్తి ఆ లంబోర్గిని కారును జాన్వీ ఇంటికి డ్రైవ్‌ చేసుకుని వెళ్లి ఇచ్చేశాడు. అంతేకాదు ఆ కారులో ఒక పెద్ద గిఫ్ట్‌ బాక్స్‌ కూడా ఉంది. ఇక లంబోర్గిని కారు విలువ దాదాపు రూ.5 కోట్లు.

ఎవరీ అనన్య బిర్లా?
బిజినెస్‌ టైకూన్‌ కుమార్‌ మంగళం- నీరజ బిర్లాల కూతురే అనన్య. ఈమె సింగర్‌ మాత్రమే కాదు ఎంటర్‌ప్రెన్యూర్‌ కూడా! తాజాగా ఆమె మేకప్‌ బ్రాండ్‌ను కూడా లాంచ్‌ చేసింది. దీనికి జాన్వీ ప్రచారకర్తగా ఉండనుందని, అందుకు కృతజ్ఞతగా ఈ బహుమతిని పంపించిందని తెలుస్తోంది.

జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురిగా చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ధడక్‌ చిత్రంతో సినీప్రయాణం ఆరంభించింది. గుంజన్‌ సక్సేనా, రూహి, గుడ్‌ లక్‌ జెర్రీ, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి వంటి సినిమాలు చేసింది. దేవర: పార్ట్‌ 1 చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో పెద్ది మూవీలో యాక్ట్‌ చేస్తోంది. అలాగే ఆమె చేతిలో పరమ సుందరి, సన్నీ సంస్కారీ కి తులసి కుమారి చిత్రాలున్నాయి.

 

 

చదవండి: థియేటర్లలో ఆల్కహాల్‌ అమ్మకాలు.. తూలుతూ సినిమా చూడొచ్చు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement