
ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లలో ఒకటైన గ్యాలరీస్ లఫాయెట్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ముంబైలోని కాలా ఘోడాలోని చారిత్రాత్మక టర్నర్ మోరిసన్ అండ్ వోల్టాస్ హౌస్ భవనాలలో తన తొలి భారతీయ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించింది. గ్యాలరీస్ లఫాయెట్ , భారతీయ వ్యాపారం ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ లిమిటెడ్ (ABFRL) ప్రత్యేక భాగస్వామ్యంతో ఇది అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇండియన్ లగ్జరీ ఫ్యాషన్ మార్కెట్‌లో ఇదొక చారిత్ర క్షణమని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ సందర్భంగా ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా అరేబియా సముద్రంలో అద్భుతమైన వేడుకను నిర్వహించాయి. గేట్‌వే ఆఫ్ ఇండియా నుండి, యాచ్‌లలో కుమార్ మంగళం బిర్లా, అనన్యా బిర్లా ,గ్యాలరీస్ లఫాయెట్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నికోలస్ హౌజ్ ఈ లాంచింగ్ ఈవెంట్‌ను అద్భుతంగా నిర్వహించారు. గ్యాలరీస్ లఫాయెట్ ముంబై లాంచ్‌లో యువ పారిశ్రామికవేత్త, ఆదిత్య బిర్లా వ్యాపార వారసురాలు అనన్య బిర్లా (Ananya Birla) ఎరుపు రంగు ఆలిస్ ఒలివియా సూట్‌లో అద్భుతమైన లుక్‌తో ఆకట్టుకున్నారు. ఆమె తల్లి ఆభరణాలు, రోలెక్స్, సొగసైన సన్ గ్లాసెస్‌తో కాంటెంపరరీ పవర్ డ్రెస్సింగ్‌తో తన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకున్నారు.
కాగా బెయిన్ & కో ప్రకారం, దేశంలోని లగ్జరీ విభాగం 2030 నాటికి 3.5 రెట్లు పెరగనుంది. ఫ్రెంచ్ ఐకాన్ గ్యాలరీస్ లఫాయెట్ 130 ఏళ్ల ఫ్యాషన్, కళ , సంస్కృతి వారసత్వాన్ని ఆదిత్య బిర్లా గ్రూప్ భారతీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. ముంబైలో 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయిదు అంతస్తుల్లో ఇది రూపుదిద్దుకుంది. ఈ స్టోర్‌ను లండన్‌కు చెందిన ఆర్కిటెక్చరల్ సంస్థ వర్జిల్ + పార్టనర్స్ రూపొందించారు.
