సాక్షి, ముంబై: అద్భుతమైన గొంతుతో సంగీత ప్రియుల్ని ఉర్రూత లూగించిన సంగీత దిగ్గజం , గాయకుడు శంకర్ మహదేవన్ తన విభిన్నమైన రుచులు, దక్షిణ భారత వంటకాలతో ఆహార ప్రియుల్ని ఆకట్టు కుంటున్నారు. ముంబైలో శంకర్ మహదేవన్ రెస్టో-కేఫ్ ‘మాల్గుడి రెస్టారెంట్’ సౌత్ ఇండియన్ రెస్టారెంట్‌ను ముంబైలో స్పెషల్‌గా ఎట్రాక్షన్‌గా నిలుస్తోంది.
ముంబై నగరం దక్షిణ భారత ఆహారాన్నిబాగా ఇష్టపడతారు. క్లాసిక్ ఫిల్టర్ కాఫీ, మెత్తని ఇడ్లీలు, రకరకాల దోసెలు -స్టైల్ దోసెలు ఇవి నగరానికి స్పెషల్ ఆకర్షణ . ఈ నేపథ్యంలో శంకర్ మహదేవన్ ఫుడ్ బిజినెస్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ రెస్టారెంట్ల చెయిన్ పేరు మాల్గుడి డేస్. ప్రముఖ ఆంగ్ల రచయిత ఆర్.కె. నారాయణ్ రాసిన "మాల్గుడి డేస్" అనే పుస్తకమే దీని ప్రేరణ. ప్రస్తుతం బోరివాలీలో ఒక రెస్టారెంట్ ప్రారంభం కాగా, చెంబూర్ , లోయర్ పరేల్ ప్రాంతాల్లో మరిన్ని రెస్టారెంట్లు త్వరలో ప్రారంభం కానున్నాయి.

శంకర్ మహదేవన్, కె. ఎస్. రామకృష్ణన్ సహభాగస్వామ్యంతో ఈటోపియా హోల్డింగ్స్ మధ్య సహకారంతో మాల్గుడి రూపు దిద్దుకుంది. వచ్చే ఏడాది 2026లో దుబాయ్‌లో కూడా మాల్గుడి రెస్టారెంట్ బ్రాంచ్ ఓపెన్ కానుంది. ఈ రెస్టారెంట్‌ను ఇంటీరియన్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దడం విశేషం. ఇండిగో, టెర్రకోట రంగులు, ఇత్తడి లైటింగ్, కేన్ కుర్చీలు, టేకు టేబుళ్లతో పాటు, తీరప్రాంత గృహాలు, టెంపుల్ టౌన్స్ ప్రతిబింబించేలా ఉంటాయి. హ్యాండ్ పెయింటింగ్స్, చెట్టినాడ్-శైలిటైల్‌వర్క్, ఓపెన్ కిచెన్ లాంటివాటితో డైనమిక్ లుక్‌తో ఆకట్టుకుంటోంది.

మాల్గుడి రెస్టారెంట్: ఫుడ్ మెనూ
కమ్మని వాసనతో సాంప్రదాయ ఫిల్టర్ కాఫీతో పాటు ఆధునికి కాపుచినో వెరైటీస్ కూడా ఇక్కడ ఉంటాయి. శతాబ్దాల నాటి వంటకం ముల్బాగల్ లెగసీ నేతి దోస ఒక సిగ్నేచర్ ఆఫర్. ఇది ప్లెయిన్, మసాలా, చీజ్ మరియు చీజ్ మసాలా వైవిధ్యాలలో లభిస్తుంది. పోడి చీజ్ బాల్స్, అన్నా స్టైల్ క్రిస్పీ లోటస్ రూట్ ,బట్టర్ పెప్పర్ గార్లిక్ వాటర్ చెస్ట్‌నట్, కాకిస్ షీరా లభిస్తాయి. ఇంకా శంకర్ మహదేవన్‌కు ఎంతో ఇష్టమైన క్రీమీ శ్రీలంక తమిళ కర్రీని ఇడియప్పం ఉంటాయి. బిసి బెలే బిబింబాప్, పనీర్ నెయ్యి రోస్ట్ విత్ నీర్ దోస, వెన్ పొంగల్ అరన్సిని ,ఎలానీర్ పాయసం ఇలా ఎన్నో రుచులను ఇక్కడ ఆస్వాదించవచ్చు.
ఇదీ చదవండి: పరువు పేరుతో ప్రేమకు సమాధి, తప్పెవరిది?


